Relationship:దీర్ఘకాలం శృంగారానికి దూరమైతే..వచ్చే సమస్యలు ఇవే
Relationship: మహిళల్లో వయస్సు పెరుగుతున్నా కొద్దీ శృంగారపు కోరికలు తగ్గుతుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈక్రమంలో ప్రతి 10 మందిలో ఒకరు హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Relationship: శృంగారం..భార్య భర్తల మధ్య ప్రేమానురాగాన్ని పెంచుతుంది. కానీ గర్భవతి, ప్రసవం తర్వాత, మోనోపాజ్ వంటి దశల్లో చాలా మంది మహిళల్లో ఆ ఆసక్తి తగ్గుతుంది. అంతేకాదు మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ శృంగారపు కోరికలు కూడా తగ్గుతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రతి 10 మందిలో ఒకరు హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే శృంగారపు కోరికలు పూర్తిగా తగ్గిపోవడం, దాంతో కలయికకు దూరంగా ఉండటం దీని అర్థం. ఈ క్రమంలో కొంతమంది మహిళలు రోజులు, నెలలు, ఏండ్ల తరబడి శృంగారానికి దూరమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. నిజానికి దీనివల్ల శరీరంలో పలుమార్పులు చోటుచేసుకోవడంతోపాటు మానసికంగానూ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలేంటో తెలుసుకుందామా?
హార్మోన్లు:
హార్మోన్లు జీవక్రియ పనితీరులో కీలక పాత్ర వహిస్తాయి. వీటి విడుదలను బట్టే శరీరంలోని ఆర్గాన్స్ వాటి పనులను పూర్తి చేస్తాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు, వెజైనా ఆరోగ్యం, ఆక్సిటోసిన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు ముఖ్యపాత్రపోషిస్తాయి. లవ్ హార్మోన్ గా పిలిచే ఆక్సిటోసిన్ ప్రేమ భావనను మనలో ప్రేరేపిస్తుంది. భాగస్వామితో సాన్నిహిత్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇక సెక్స్ హార్మోన్ గా పిలిచే ఈస్ట్రోజెన్ వెజైనాను ఆరోగ్యంగా ఉంచుతుంది. లైంగిక కోరికలను కలగజేసేంది ఈ హార్మోనే. అయితే శృంగారానికి దూరంగా ఉండే వారిలో ఈ రెండుహార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులోనూ ఈ కోరికలు శాశ్వతంగా దూరం అవ్వడంతోపాటు శరీరంలో శక్తి స్థాయిలు తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్, వంటి సమస్యలువస్తాయని చెబుతున్నారు. ఇవి దరిచేరకూడదంటే శృంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.
ఇన్ఫెక్షన్లు తప్పవు:
ఎక్కువ కాలం శృంగారానికి దూరమైతే వెజైనా ఆరోగ్యం దెబ్బతింటుందని..కాలక్రమేనా ఇది వెజైనల్ ఇన్ఫెక్షన్లకు దారి తీసే ప్రమాదం కూడా ఉందంటున్నారు నిపుణులు. వెజైనాకు రక్తప్రసరణ తగ్గడం ఇందుకు కారణం అంటున్నారు. తరచూ కలయికలో పాల్గొనకపోవడం వల్ల వ్యక్తిగత భాగాలకు రక్తప్రసరణ సరిగ్గా జరుగక వెజైన పొడిబారుతుంది. దీంతో కలయికలో పాల్గొన్నప్పుడు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి శృంగారానికి పూర్తిగా దూరమవ్వడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
ఇమ్యూనిటీ:
దీర్ఘకాలంగా కలయికకు దూరంగా ఉంటే ఇమ్యూనిటీపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో శరీరానికి ఇన్ఫెక్షన్లు, వ్యాధులను ఎదుర్కునే సామర్థ్యం తగ్గుతుంది. వారానికోసారి లేదా రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారిలో ఎక్కువ మొత్తంలో కొన్ని రకాల యాంటీ బాడీలు రిలీజ్ అయినట్లు మరో అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడి ఇమ్యూటిని పెంచడంలో సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి, ఆందోళన వద్దు:
ఇక నేటికాలంలో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. కలయికలో ఎండార్ఫిన్లు విడుదలవ్వడమే ఇందు కారణం. ఇవిఫీల్ గుడ్ హార్మోన్లు. ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా మనస్సును ప్రేరేపిస్తాయి. శృంగారానికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో ఈ హార్మోన్ల విడుదల తగ్గుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీవంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి సాన్నిహిత్యాన్ని కూడా కోల్పోవడం వల్ల వీటి తీవ్రత పెరుగుతుంది. అందుకే శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు దోహదం చేసే శృంగారాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు.