Health Tips: శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ పెరగడానికి ఇవే ముఖ్య కారణాలు..!

Health Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం అంటే గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని అర్థం.

Update: 2022-06-30 13:30 GMT

Health Tips: శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ పెరగడానికి ఇవే ముఖ్య కారణాలు..!

Health Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం అంటే గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని అర్థం. ఈ పరిస్థితిలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే తరువాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించడానికి మీరు మొదట మీ ఆహారాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే కొంతమంది చెడు ఆహారాన్ని తింటారు. దీని కారణంగా వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ పరిస్థితిలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలేంటో తెలుసుకుందాం.

1. చెడు ఆహారపు అలవాట్లు

అన్నింటిలో మొదటిది మీ డైట్‌. ఎందుకంటే మీరు తినే ఆహారం శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. మీరు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు కొన్ని ఆహారాలకి దూరంగా ఉంటే మంచిది. ఆహారంలో ఎక్కువ పచ్చి కూరగాయలను చేర్చుకుంటే ప్రయోజనం పొందుతారు.

2. ఊబకాయం

మీరు బరువు పెరిగినప్పుడు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఈ రకమైన సమస్యతో బాధపడకుండా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి.

3. మద్యం, ధూమపానం

ఆల్కహాల్‌తో పాటు పొగ తాగితే ఆరోగ్యంతో ఆడుకుంటున్నట్టే.. ఎందుకంటే ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిలో మీరు ఈ రెండింటినీ నివారించాలి. లేదంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిరంతరం పెరుగుతుంటుంది.

Tags:    

Similar News