Lifestyle: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? జింక్‌ లోపం ఉన్నట్లే..!

Zinc Deficiency: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన ఖనిజాలు లభించాలనే విషయం తెలిసిందే. ఏ ఒక్కటి లోపించినా అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతుంటారు.

Update: 2024-06-14 16:00 GMT

Zinc Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? జింక్‌ లోపం ఉన్నట్లే..!

Zinc Deficiency: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన ఖనిజాలు లభించాలనే విషయం తెలిసిందే. ఏ ఒక్కటి లోపించినా అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతుంటారు. శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో జింక్‌ కూడా ఒకటి. ఇలాంటి ముఖ్యమైన ఖనిజం లోపిస్తే పలు సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జింక్‌ లోపిస్తే కొన్ని రకాల లక్షణాల ఆధారంగా అంచనా వేయొచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి జింక్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది లోపిస్తే శరీరానికి అంటువ్యాధులతో పోరాడటం కష్టమవుతుంది, దీని కారణంగా జలుబు, దగ్గు, చెవి ఇన్ఫెక్షన్ మొదలైనవి మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గాయం నయం కావడంలో జింక్‌ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ లోపం కారణంగా శరీరం గాయాలను నయం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోసం జింక్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో జింక్‌ లోపిస్తే.. జుట్టు రాలడం, పొడి చర్మం, మొటిమలు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు శరీరంలో జింక్‌ లోపిస్తే ఆకలి తగ్గుతుంది. ఉన్నట్లుండి బరువు తగ్గినా జింక్‌ లోపం ఉన్నట్లు అంచనా వేయాలి. ఇక వాసన చూసే సామర్థ్యం తగ్గినా శరీరంలో జింక్‌ లోపించినట్లు అర్థం చేసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారం రుచి కూడా కోల్పోతాము.

శరీరంలో జింక్‌ లోపిస్తే చూపు సరిగ్గా కనిపించదు. ముఖ్యంగా రాత్రిపూట దృష్టి లోపం ఉన్నట్లయితే జింక్‌ లోపంగా చెప్పొచ్చు. పైన తెలిపిన లక్షణాలు ఏవి కనిపించినా శరీరంలో జింక్‌ లోపించినట్లు అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యులను సంప్రదించి.. సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News