Men Health Tips: పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఇవే కారణాలు.. అవేంటంటే..?
Men Health Tips: నేటి కాలంలో చాలామంది దంపతులు సంతాన లేమి సమస్యని ఎదుర్కొంటున్నారు.
Men Health Tips: నేటి కాలంలో చాలామంది దంపతులు సంతాన లేమి సమస్యని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. వీర్యం స్పెర్మ్ ఉత్పత్తి చేయని పురుషుల పరిస్థితిని అజోస్పెర్మియా అంటారు. దాదాపు ఒక శాతం మంది పురుషులలో ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి పురుషులు తమ భాగస్వామిని గర్భవతిని చేయడానికి ప్రయత్నిస్తారు కానీ విజయం సాధించలేరు. ఈ పరిస్థితిలో వృషణాలలో స్పెర్మ్ ఉత్పత్తి కాదు.
అజూస్పెర్మియా వల్ల పురుషులలో వంధ్యత్వం రాదు కానీ ఇది ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల అజూస్పెర్మియా ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. చాలా మంది పురుషులు ఇబ్బంది పడటం వల్ల ఈ సమస్య గురించి చెప్పరు. మీరు నిపుణుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
టెన్షన్ పడకూడదు
ప్రతి విషయానికి టెన్షన్ పడకూడదు. ఎందుకంటే ఒత్తిడి కారణంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఆందోళన, ఒత్తిడి కారణంగా స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.
వ్యాయామం తప్పనిసరి
వ్యాయామం చేయని వారు ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడతారు. స్థూలకాయం కారణంగా స్పెర్మ్ కదలిక తక్కువగా ఉంటుంది. ఇది మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.
ఆలస్యంగా నిద్ర
ఈ రోజుల్లో చాలా మంది యువకులు అర్థరాత్రి వరకు నిద్రపోరు. దీనివల్ల ఒత్తిడి, ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు స్పెర్మ్ కౌంట్ సమస్యని ఎదుర్కొంటారు. ఇది కాకుండా రాత్రి మేల్కొలపడం వల్ల మీరు మానసికంగా ఆందోళన చెందుతారు. రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. అందుకే ఆలస్యంగా నిద్రించే అలవాటును మార్చుకోవాలి.