Health Tips: పొట్ట చుట్టూ.. కొవ్వు తగ్గి..నాజుకైన నడుము కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Health Tips: పొట్ట కొవ్వు అనేది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో గుండెపోటు, బ్లడ్ ప్రెజర్, షుగర్ వంటి వ్యాధులకు కారణం అవుతుందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే వేలాడే పుట్టకొవ్వులో కొలెస్ట్రాల్ అత్యధిక శాతం ఉంటుంది. ఇది మిమ్మల్ని అనారోగ్య కరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే పొట్ట కొవ్వుని వీలైనంతవరకు కరిగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Update: 2024-08-09 06:28 GMT

Health Tips: పొట్ట చుట్టూ.. కొవ్వు తగ్గి..నాజుకైన నడుము కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి

   Health Tips:  పొట్ట కొవ్వు అనేది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో గుండెపోటు, బ్లడ్ ప్రెజర్, షుగర్ వంటి వ్యాధులకు కారణం అవుతుందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే వేలాడే పుట్టకొవ్వులో కొలెస్ట్రాల్ అత్యధిక శాతం ఉంటుంది. ఇది మిమ్మల్ని అనారోగ్య కరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే పొట్ట కొవ్వుని వీలైనంతవరకు కరిగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది మిమ్మల్ని ఊబకాయం వైపు నడిపిస్తుంది. పొట్టకొవ్వు వల్ల అనేక జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే పొట్ట కొవ్వును సీరియస్ గా తీసుకొని కొన్ని చిట్కాలను పాటించినట్లయితే, వెంటనే తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా పొట్ట కొవ్వును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పొట్ట కొవ్వును తగ్గించుకునేందుకు వ్యాయామాన్ని మించిన మార్గం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పొట్టలో చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే, తప్పనిసరిగా వ్యాయామమే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట కొవ్వును తగ్గించుకునేందుకు రోజుకు కనీసం 3,500 కెలోరీలను కరిగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం అటు స్ట్రిక్ట్ గా డైట్ చేయడంతో పాటు శారీరక వ్యాయామం కూడా తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అసలు పొట్ట కొవ్వు ఎందుకు ఏర్పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు కొవ్వు అనేది శక్తిగా మారుతుంది. అయితే మనం ఎక్కువగా శారీరక శ్రమ చేయనప్పుడు, ఆ కొవ్వు చర్మ కణాల పైన పేరుకుపోతూ ఉంటుంది. ముఖ్యంగా పొట్ట భాగంలోనూ, పిరుదుల భాగంలోనూ, తొడల భాగంలోను, ఛాతి భాగంలోనూ పేరుకుపోతుంది ఈ కొవ్వును కరిగించుకోవాలంటే శారీరక వ్యాయామమే తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పొట్ట కొవ్వు సహజసిద్ధ పద్ధతిలో ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం

యోగ:

ప్రాచీన యోగ పద్ధతుల ద్వారా మీరు పొట్ట కొవ్వును సులభంగా తొలగించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. మీరు కనీసం 12 వారాలపాటు యోగా చేయడం ద్వారా పొట్ట కొవ్వును సులభంగా ఇంట్లోనే కరిగించుకోవచ్చు. తద్వారా మీరు చురుకుగా మారే అవకాశం కూడా ఉంటుంది. యోగాసనాలు వేయడం ద్వారా మీ హృదయంపైన కూడా భారం పడదు తద్వారా మీరు సులభంగానే బరువును తగ్గించుకోవచ్చు.

ప్లాంక్ ఎక్సర్ సైజ్ చేయడం:

నేలపై పడుకొని కాళ్ళను పైకెత్తి మళ్లీ కిందకు దించి ఇలా 30 సెకండ్ల పాటు పైకి కిందికి కాళ్ళను కదపడం ద్వారా పొట్ట కొవ్వు పై భారం పడి కొవ్వు కరిగిపోతుంది. ఈ వ్యాయామం కనీస 30 సెకండ్ల పాటు చేయాల్సి ఉంటుంది.

క్రంచెస్:

క్రంచెస్ వ్యాయామంలో మీరు నిలబడి కాళ్ళను మడిచి ఒక కాలును ఒకసారి పైకి మరిచి పెట్టుకోవాలి. అలాగే మరో కాలును మడిచి పొట్టపై భారం కల్పించాలి. ఇలా పైకి కిందికి కాళ్ళను మడిచి కిందికి సాగదీయడం ద్వారా పొట్ట కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది. మీరు పడుకొని కూడా ఈ క్రంచెస్ చేయవచ్చు.

వాకింగ్ చేయడం:

మీరు రోజుకు కనీసం పదివేల అడుగులైనా వాకింగ్ చేసినట్లయితే, పొట్ట కొవ్వు ఆటోమేటిక్ గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు అదనపు కొవ్వును తొలగించుకోవచ్చు. పొట్ట కొవ్వును తొలగించుకునేందుకు ఇది ఆరోగ్యకరమైన పద్ధతి.

డైటింగ్ ఎలా చేయాలి?

ఇక డైటింగ్ విషయానికి వస్తే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి, ఆహార పదార్థాలను తీసుకుంటే పొట్ట కొవ్వు కరిగిపోతుంది. రక్తంలో కరిగిపోయే ఫైబర్ కొవ్వు కణాలను శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా మీరు కార్బోహైడ్రేట్లను తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు పండ్లు తినాల్సి ఉంటుంది.

పంచదార ప్రాసెసింగ్ ఫుడ్స్:

అలాగే పంచదార ఇతర ప్రాసెసింగ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ దూరంగా ఉంచాల్సి ఉంటుంది. మైదా పిండితో చేసినటువంటి ఆహార పదార్థాలను వీలైనంతవరకు మానివేస్తే మంచిది.

సోడియం:

అలాగే సోడియం తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది తద్వారా మీరు శరీరంలో కొవ్వు నిలబడకుండా కాపాడుకోవచ్చు

Tags:    

Similar News