Mental Stress: మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఇలా చేయండి..!

Mental Stress: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజల జీవనశైలి చాలా దారుణంగా మారింది.

Update: 2022-09-29 10:19 GMT

Mental Stress: మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఇలా చేయండి..!

Mental Stress: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజల జీవనశైలి చాలా దారుణంగా మారింది. చాలామంది పనిఒత్తిడి వల్ల మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. అంతేకాదు ఈ కారణంగా చాలా వ్యాధులకి గురవుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో అవస్థలు పడుతున్నట్లయితే అస్సలు తేలికగా తీసకోవద్దు. వెంటనే మానసిక నిపుణుడిని సంప్రదించాలి. విశ్రాంతి లేకపోవటం వల్ల ఆందోళన పెరిగి ఏ పనిచేయలేరు. అందుకే కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం దొరుకుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తి చాలా టెన్షన్, ఇబ్బందిని కలిగి ఎవరితో కలవకుండా ఉంటాడు. ఎప్పుడు అలిసిపోయి కనిపిస్తాడు. ఇలాంటి వ్యక్తులు రోజు మొత్తం తలనొప్పితో బాధపడుతుంటారు. ఎప్పుడు చిరాకుగా ప్రవర్తిస్తారు. అంతేకాదు వీరికి నిద్ర సమస్యలు కూడా ఉంటాయి. అతనికి ఏ పని చేయాలనే ఇంట్రెస్ట్‌ ఉండదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మానసిక నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

టెన్షన్‌ పెరగడం వల్ల పెద్ద సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితిలో నిపుణుడు చెప్పినట్లుగా వ్యాయామం చేస్తే చాలా ఉపశమనంగా ఉంటుంది. మొదట నిటారుగా కూర్చుని లోతైన శ్వాస తీసుకోవాలి. తర్వాత కొంత విరామం ఇచ్చి మళ్లీ శ్వాస తీసుకోవాలి. ఇలా చాలాసార్లు చేయాలి. మనసు కుదుటపడుతుంది. తర్వాత భవిష్యత్‌పై దృష్టిమరల్చాలి. ఒత్తిడిని వదిలించుకోవడానికి ధ్యానం మంచి మార్గం. మీకు ఇబ్బంది అనిపించినప్పుడల్లా ధ్యానం చేస్తే మంచి రిలాక్స్‌ దొరుకుతుంది. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. సన్నిహితులతో మాట్లాడండి. మంచి సంగీతం వినండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. వెంటనే ఒత్తిడి నుంచి బయటపడుతారు.

Tags:    

Similar News