Sleep: సరైన నిద్ర లేకపోతే ఈ సమస్యలు తప్పవు.. అవేంటంటే..?
Sleep: పని వల్ల ప్రజలు ఆరోగ్యంపై అస్సలు శ్రద్ధ చూపరు. దీని కారణంగా వారు అనేక వ్యాధులను గురికావాల్సి ఉంటుంది.
Sleep: పని వల్ల ప్రజలు ఆరోగ్యంపై అస్సలు శ్రద్ధ చూపరు. దీని కారణంగా వారు అనేక వ్యాధులను గురికావాల్సి ఉంటుంది. ఇది శరీరానికి చాలా నష్టం కలిగిస్తుంది. నిద్రలేమి వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. నిద్ర ఒక మనిషికి చాలా ముఖ్యమైనది. ఇది మన రోజులోని అలసటను తగ్గిస్తుంది. అలాగే దీని వల్ల శరీరం తొందరగా అలసిపోదు. అయితే మీకు తగినంత నిద్ర పోకపోతే బరువు పెరుగుతారని గుర్తుంచుకోండి. మీరు సరిగ్గా నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
1. బలహీనమైన జీవక్రియ
మంచి నిద్ర లేకపోవడం వల్ల జీవక్రియ బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఇది అన్ని సమయాలలో అలసట, మలబద్ధకానికి దారితీస్తుంది. దీని కారణంగా బరువు పెరగుతారు. కాబట్టి మంచి నిద్ర పొందడానికి ప్రయత్నించండి.
2. ఆకలి పెరుగుతుంది
నిద్ర లేకపోవడం వల్ల లేదా తక్కువ నిద్ర వల్ల శరీరంలో గ్రెలిన్ హార్మోన్ పెరుగుతుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. గ్రెలిన్ హార్మోన్ ఆకలిని పెంచుతుంది. ఇది నిద్ర రాకుండా చేస్తుంది. కాబట్టి విపరీతంగా బరువు పెరుగుతారు.
3. వ్యాయామం
మంచి నిద్ర లేకపోతే మరుసటి రోజు వ్యాయామం చేయలేరు. ఇది మన బరువు పెరగడానికి ఒక కారణం. ఈ పరిస్థితిలో మనం నీరసంగా లేదా అలసటగా ఉంటాం. సరైన శక్తితో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.
4. అలసట
డీప్ స్లీపర్‌లు మరుసటి రోజు చురుకుగా, రిఫ్రెష్‌గా ఉంటారు. అయితే మీరు సరిగ్గా నిద్రపోకపోతే రోజంతా బద్ధకంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. దీని కారణంగా మీ క్యాలరీ బర్న్ తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో బరువు పెరుగుతారు.