Hair Fall Solution: ఈ 5 సూపర్ ఫుడ్స్ జుట్టు రాలకుండా నిరోధిస్తాయి.. పొడవాటి జుట్టును పొందుతారు..!
Hair Fall Solution: ఈ రోజుల్లో మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా అందరు జుట్టు రాలే సమస్యని ఎదుర్కొంటున్నారు.
Hair Fall Solution: ఈ రోజుల్లో మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా అందరు జుట్టు రాలే సమస్యని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి సరిగ్గా లేకపోవడం. దీనికి తోడు పొల్యూషన్, దుమ్ముధూళి వల్ల జుట్టు రాలుతోంది. వాస్తవానికి జుట్టు మన అందంలో ముఖ్యమైన భాగం. వీటిని ఆరోగ్యంగా బలంగా ఉంచడానికి సరైన పోషకాహారం అవసరం. జుట్టు సంరక్షణ కోసం కొన్ని ఆహారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పెరుగు
ప్రోటీన్, కాల్షియం అవసరాలను తీర్చడానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. అదనంగా పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి బట్టతల రాకుండా మిమ్మల్ని సంరక్షిస్తాయి.
వాల్‌నట్స్
వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ, విటమిన్ బి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు ఉంటాయి. ఇవన్నీ జుట్టును బలంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
అవకాడో
అవకాడో జుట్టుకు ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, కాల్షియం అందిస్తుంది. దీని వినియోగం జుట్టును బలపరుస్తుంది పలుచబడకుండా చేస్తుంది.
ఆకుకూరలు
బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుకూరలలో ఫైబర్, ఫోలేట్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి అవసరం. జుట్టును బలోపేతం చేయడంలో బాగా పనిచేస్తాయి.
గుడ్లు
గుడ్లు జుట్టుకు సంపూర్ణ పోషణను అందిస్తాయి. గుడ్డులో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడంలో, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి.