Potatoes: బంగాల దుంపలు తింటే బరువు పెరుగుతారా..!

Potatoes: బంగాళాదుంపలని దుంపలలో రారాజు అని వర్ణిస్తారు. ఎందుకంటే ఇవి తక్కువ ధరలో లభిస్తాయి.

Update: 2022-07-30 12:30 GMT

Potatoes: బంగాల దుంపలు తింటే బరువు పెరుగుతారా..!

Potatoes: బంగాళాదుంపలని దుంపలలో రారాజు అని వర్ణిస్తారు. ఎందుకంటే ఇవి తక్కువ ధరలో లభిస్తాయి. అంతేకాకుండా ప్రతి కూరగాయలతో కలిపి వండవచ్చు. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు బంగాళదుంపల వినియోగాన్ని తగ్గించాలని సాధారణంగా చెబుతారు. ఎందుకంటే ఈ దుంపలలో కేలరీలు, స్టార్చ్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊబకాయానికి దారితీస్తాయని నమ్ముతారు.

వాస్తవానికి బంగాళాదుంపలు తింటే బరువు పెరుగుతారా లేదా అనేది వాటిని ఉడికించే పద్దతిపై ఆధారపడి ఉంటుంది. ఉడకబెట్టిన బంగాళాదుంపలతో చిప్స్, ఆలూ పరాటాలు, స్పైసీ బంగాళదుంప కూర, ఆలూ చాట్ వంటివి తయారుచేస్తారు. మీరు ఈ రూపాల్లో బంగాళాదుంపలను తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. ఒకవేళ మీరు బరువు పెరగకూడదనుకుంటే బంగాళాదుంపలను ప్రత్యేక పద్ధతిలో ఉడికించాలి.

తర్వాత వాటిని ఫ్రిజ్‌లో కొద్దిసేపు ఉంచాలి. తర్వాత ఫ్రిజ్‌లో నుంచి తీసి కొద్దిసేపు బయటపెట్టాలి. ఇలా చేయడం వల్ల ఈ దుంపలలో ఉండే GI (గ్లైసెమిక్ ఇండెక్స్) తగ్గుతుంది. స్థూలకాయం, మధుమేహం ఉన్న రోగులకు ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇప్పుడు బంగాళాదుంపలను వైట్ వెనిగర్‌లో వేసి కడగాలి. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు వాటికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే జీర్ణక్రియను సులువుగా జరుగుతుంది. గ్లూకోజ్ స్థాయి కూడా అకస్మాత్తుగా పెరగదు.

Tags:    

Similar News