Coriander: కొత్తిమీరతో అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

Coriander: తెలుగు రాష్ట్రాల్లో కొత్తమీర లేనిదే మహిళలు దాదాపు ఏ వంటకాలు చేయరు.

Update: 2022-07-23 15:00 GMT

Coriander: కొత్తిమీరతో అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

Coriander: తెలుగు రాష్ట్రాల్లో కొత్తమీర లేనిదే మహిళలు దాదాపు ఏ వంటకాలు చేయరు. మాంసాహారమైనా, శాఖాహారమైనా కొత్తిమీర ఉండాల్సిందే. ఇది వంటలకి అదనపు రుచిని అందిస్తుంది. దీని వాసన అద్భుతంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రోజువారీ ఆహారంలో కొత్తిమీర తీసుకుంటే చాలా పోషకాలు శరీరానికి అందుతాయి. ఆయుర్వేదం ప్రకారం కొత్తి మీర ఔషధ గుణాలని కలిగి ఉంటుంది.

కొత్తిమీరలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సుగుణాలు విటమిన్‌ ఏ, సి, క్యాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇందులోని యాంటీ బయోటిక్‌ మూలకాలు రక్తంలోని చెక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. అందువల్ల కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తాగితే మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. కొత్తిమీర రసంలో కొద్దిగా పంచదార, నీళ్లు కలిపి వారం రోజులపాటు పరగడుపున తాగితే శరీరంలో నీరసం, నిస్సత్తువలు తగ్గుతాయి. లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్బిక్‌ యాసిడ్స్‌ కొత్తిమీరలో ఉంటాయి. ఇవి గుండె సమస్యల ముప్పుని తగ్గిస్తాయి.

ప్రతిరోజు కొత్తిమీర వాడటం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేగాక ఇందులో ఉండే యాంటీ పాస్మోడిక్‌ గుణాల వల్ల కాలేయం పనితీరుని బాగుచేస్తుంది. కొత్తిమీర చట్నీ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొత్తిమీర శరీరంలో సోడియంను బయటకు పంపి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్‌ఐని తగ్గిస్తుంది. కేన్సర్‌ వచ్చినపుడు కొత్తిమీర తింటే కణాల పెరుగుదలని నిరోధిస్తుంది.

Tags:    

Similar News