వేసవిలో ఆ వ్యాధి ప్రమాదం ఎక్కువ.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు..

Summer Disease: వాతావరణం మారుతున్న కొద్దీ వ్యాధులు వాటి రూపాన్ని మార్చుకోవడం ప్రారంభిస్తాయి...

Update: 2022-03-11 08:30 GMT

వేసవిలో ఆ వ్యాధి ప్రమాదం ఎక్కువ.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు..

Summer Disease: వాతావరణం మారుతున్న కొద్దీ వ్యాధులు వాటి రూపాన్ని మార్చుకోవడం ప్రారంభిస్తాయి. సీజన్ మారడంతో అటాక్‌ చేస్తాయి. వేసవి కాలంలో ఈ వ్యాధులు సాధారణం అయినప్పటికీ సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతాయి. ఈ వ్యాధుల చికిత్స కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే అలాంటి కొన్ని వ్యాధుల గురించి, వాటి నివారణల గురించి తెలుసుకుందాం.

హీట్ స్ట్రోక్

హీట్ స్ట్రోక్ అనేది వేసవిలో సర్వసాధారణమైన వ్యాధి. ఇది శరీరంలో నీటి కొరత కారణంగా వస్తుంది. వేసవిలో హీట్ స్ట్రోక్ చాలా సాధారణమైనదిగా పరిగణించినప్పటికీ సరైన సమయంలో చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకం కావచ్చు. హీట్ స్ట్రోక్‌లో ఫుడ్ పాయిజనింగ్, జ్వరం, కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి దీనికి సరైన చికిత్స అవసరం.

హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి సులభమైన మార్గం మంచి ఆహారం తినడం. ఎందుకంటే శరీరంలో నీటి కొరత వేసవిలో ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఎక్కువగా నీళ్లు తాగుతూ, పచ్చి కూరగాయలు, సలాడ్లు, పండ్లు కచ్చితంగా తీసుకోవాలి. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఉండదు. ఇది హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎండాకాలంలో ఎసిడిటీ కూడా పెద్ద సమస్య. ప్రయాణంలో ఎసిడిటీ సమస్య వస్తే ప్రాణం పోయినట్లే. ఎసిడిటీలో ఛాతీలో మంట, నొప్పి, వాంతులు వంటి ఇతర సమస్యలు సంభవిస్తాయి. ఈ సమస్య పదేపదే జరగడం ప్రారంభించినప్పుడు ఇది తీవ్రమైన రూపంలో ఉంటుంది. కొన్నిసార్లు ఇది ప్రజలను ఆసుపత్రికి తీసుకువెళుతుంది. అందుకే ముందుగానే అప్రమత్తంగా ఉండటం అవసరం.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News