Health Tips: చలికాలంలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ.. ఇవి పాటిస్తే స్ట్రాంగ్‌గా ఉంటారు..!
Health Tips: నవంబర్ నెల కొనసాగుతోంది. దేశంలో శీతాకాలం ముదిరింది. చలి తీవ్రత బాగా పెరిగింది. చలికాలం చల్లదనంతో పాటు అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది.
Health Tips: నవంబర్ నెల కొనసాగుతోంది. దేశంలో శీతాకాలం ముదిరింది. చలి తీవ్రత బాగా పెరిగింది. చలికాలం చల్లదనంతో పాటు అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది. మన జీవనశైలి, ఆహారం మార్చుకుంటే ఈ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. చలికాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో గుండెను పదిలంగా కాపాడుకోవాలి. ఈ పనులు చేయడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంటుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఆరోగ్యవంతమైన శరీరం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయడం అవసరం. శీతాకాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం శరీరంలోని అనేక వ్యాధులు దూరమవుతాయి. చల్లని వాతావరణంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పొటాషియం చాలా ముఖ్యం. ఇది రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచుతుంది. చలికాలంలో పాలకూరతో సహా ఆకు కూరలు తీసుకోవాలి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మద్యపానం, ధూమపానం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. చలి కాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. అర్జున్ బెరడు, గ్రీన్ టీ వంటివి తాగాలి. ఇవి గుండెకు ప్రాణం పోస్తాయి. మాంసాహారాలకు దూరంగా ఉండాలి. అదిక కొలస్ట్రాల్ గుండెపోటుకు కారణమవుతుంది. కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు శరీరానికి కావాల్సిన నీరు అందించాలి. దీనివల్ల విసర్జన వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది.