Life Style: షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే అంజీర

Life Style: అంజీర ఆకులు మరియు పండ్లు షుగరు పేషెంట్లకు అల్పాహారం క్రింద వాడుకోవచ్చు.

Update: 2021-03-21 11:34 GMT

అంజీర్:(ఫైల్ ఇమేజ్)

Life Style: సీజన్‌లో దొరికే ఏ పండు అయినా మంచిదే! కాని అంజీర్ పండు అన్నిటికంటే భిన్నమైనది. ఇది పోషకాలగని. బజార్లలో తోపుడుబండ్ల మీద కనిపించే అంజీర్ పండ్లు ఇప్పుడు అందుబాటు ధరలోనే దొరుకుతున్నాయి. అంజీర్‌తో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతోపాటు క్లోరిన్ లభిస్తాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే, ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్‌ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే. మరిన్ని అంశాలను "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.

అధిక బ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి ఇది ఫర్ ఫెక్ట్ ఫ్రూట్. హై బ్లడ్ప్రెజర్ తో బాధపడేవారు, వారి రెగ్యులర్ డైట్ లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. అజీర పండులో పొటాషియం మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్ ను కంట్రోల్ చేస్తుంది.

అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి.

అంజీర ఆకులు మరియు పండ్లు షుగరు పేషెంట్లకు అల్పాహారం క్రింద వాడుకొవచ్చు. ఫిగ్స్ ఆకులు ఇన్సులిన్ మోతాదును క్రమబద్ధీ కరించుటలో వీటి పాత్ర అధికం.బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యడంలో ఆకుల పాత్ర అధికం.

పైల్స్ సమస్య వేధిస్తుంటే... రాత్రంతా నీటిలో నానబెట్టిన డ్రై అంజీరలను వాటర్‌తో సహా తింటే సరి. ఫైల్స్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. లైంగిక సమస్యలు, సంతాన భాగ్యం కలగనివారికి అంజీరలు అద్భుతంగా పనిచేస్తాయి. స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు, వయాగ్రాలా పనిచేసేందుకు ఇది దోహదపడతాయి. మగవాళ్లు 2 లేదా 3 అంజీర్లను రాత్రంతా పాలలో నానబెట్టి... తెల్లారే తింటూ వుండాలి.

ఆస్తమా, దగ్గు, జ్వరం లాంటి చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి ఈ పండ్లు. అంజీరలు డ్రై అయితే రేటు ఎక్కువే. అయినప్పటికీ వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తింటే మంచిదే. కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది. ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి. ఎండు పండ్లలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల హృద్రోగ నివారణకీతోడ్పడతాయి. ఎండు అంజీరాలలో ఫెనాల్, ఒమేగ3 మరియు ఒమెగ6 ఫ్యాటీ ఆసిడ్స్ చాలాఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గుండె జబ్బుల రిస్క్ నుండి బయట పడవచ్చు.

కాన్సర్స్ కు చెక్ పెట్టే అంజీర్

అంజీర్ వుండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండి, క్యాన్సర్ ను కలుగచేసే ముఖ్య కారకలైనట్టి ఫ్రీ రాడికల్స్కు వ్యతిరేఖంగా పోరాడతాయి. ముఖ్యంగా, పోస్ట్ మెనోపాజ్ స్త్రీలలో, హార్మోన్ల అసమతల్యతల వలన రొమ్ము క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. కానీ అత్తిపండ్ల ఈ రకమైన క్యాన్సర్ వ్యాధికి గురవకుండా కాపాడతాయి.

ప్రేగులలో ఏర్పడే కొలోన్ కాన్సర్ను నియంత్రించవచ్చు. అత్తిపండ్ల సారం, కాలేయ క్యాన్సర్ కణాలతో వ్యతిరేఖంగా పోరాడుతుందని, అధ్యయనాలలో తెలుపబడింది. ఈ సారం వాడకం వలన క్యాన్సర్ కణాల పెరుగుదల నియంత్రించబడటమే కాకుండా, ఇతర చికిత్సలో కన్నా, ఈ సారం వాడకం ద్వారా క్యాన్సర్ కణాలు రెట్టింపు అవటం కూడా తగ్గుతుందని అధ్యయనాలలో తెలుపబడింది. సో ఇంకెందుకు ఈ కాలంలో దొరికే అంజీర్ ను మన ఆహారం లో భాగం చేసుకుందాం.

Tags:    

Similar News