Health Tips: పరగడుపున ఈ పానీయాలు తాగితే అద్బుత ప్రయోజనాలు..!
Health Tips: పరగడుపున ఈ పానీయాలు తాగితే అద్బుత ప్రయోజనాలు..!
Health Tips: నేటి కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో అనేక రకాల ట్యాక్సిన్స్ పేరుకుపోతున్నాయి. దీనివల్ల రకరకాల రోగాలు దరిచేరుతున్నాయి. వీటిలో ఊబకాయం, కడుపు సమస్యలు, అధిక బీపీ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిలో వీటిని నివారించడానికి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం ముఖ్యం. శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకి పంపడానికి వివిధ రకాల డిటాక్స్ డ్రింక్స్ పనిచేస్తాయి. అలాంటి కొన్ని డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.
1. దాల్చిన చెక్క, తేనె పానీయం
దాల్చిన చెక్క, తేనె పానీయం శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకి పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పానీయం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి ఈ డ్రింక్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకి పంపిస్తాయి. తేనెలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటి మిశ్రమం మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
2. పుదీనా, దోసకాయ పానీయం
పుదీనా, దోసకాయ పానీయం మీ శరీరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. నిజానికి దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఈ పరిస్థితిలో ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు హైడ్రేట్ గా ఉంచుతుంది. మరోవైపు, పుదీనా ఆకులలో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ట్యాక్సిన్స్‌ని బయటికి పంపించడంలో సహాయం చేస్తాయి. అంతేకాదు ఈ రెండు పానీయాలు బరువు కూడా తగ్గిస్తాయి.