Health Tips: పురుషులకి అలర్ట్.. వీటితో ఈ లోపాన్ని తొలగించుకోండి..!
Health Tips: ఆధునిక కాలంలో జీవనశైలి సరిగ్గా లేకపోవడం, పని ఒత్తిడి వల్ల పురుషులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Health Tips: ఆధునిక కాలంలో జీవనశైలి సరిగ్గా లేకపోవడం, పని ఒత్తిడి వల్ల పురుషులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల హార్మోన్ల మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి బాగా క్షీణిస్తోంది. ఇది పురుషుల అంతర్గత బలాన్ని పెంచుతుంది. పురుషుల శరీరానికి ఈ హార్మోన్ చాలా ముఖ్యమైనది. ఇది పురుషుల సంతానోత్పత్తి నుంచి శారీరక అభివృద్ధి వరకు అన్నిటికి అవసరం. టెస్టోస్టెరాన్ హార్మోన్ను పెంచడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
పచ్చని ఆకు కూరలు
శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి ఆకుకూరలు తినాలి. వీటిలో ఐరన్, ప్రొటీన్లు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఉల్లిపాయ
శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి ఉల్లిపాయలను తినాలి. పచ్చి ఉల్లిపాయ పురుషుల సంతానోత్పత్తిని పెంచుతుంది. అలాగే ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది. ఇది మీ శారీరక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మీరు టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ సలాడ్ రూపంలో పచ్చి ఉల్లిపాయను తినండి.
దానిమ్మ
దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది. మీ శరీరంలో పురుష హార్మోన్ల స్థాయి తక్కువగా ఉంటే రోజూ దానిమ్మ రసం తాగాలి. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది. అలాగే అనేక సమస్యలను నివారిస్తుంది.
అల్లం
అల్లం టీ రుచిని పెంచుతుంది. అలాగే పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. అల్లంలోని ఔషధ గుణాలు పురుషులలో సంతానోత్పత్తిని పెంచడంలో చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి.