Teeth Pain: దంతాలు నొప్పిగా ఉన్నాయా.. ఈ తప్పులు చేయకండి..!

Teeth Pain: దంతాలు నొప్పిగా ఉన్నాయా.. ఈ తప్పులు చేయకండి..!

Update: 2022-03-17 15:30 GMT

Teeth Pain: దంతాలు నొప్పిగా ఉన్నాయా.. ఈ తప్పులు చేయకండి..!

Teeth Pain: శరీరంలోని ఇతర అవయవాల మాదిరే దంతాలు కూడా చాలా ముఖ్యమైన భాగం. ఇవి మీ ముఖం అందంగా కనిపించేలా చేస్తాయి. కానీ చెడు జీవనశైలి, బ్రష్ చేయకపోవడం వల్ల కొన్నిసార్లు మన దంతాలలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. దంతాలలో ఇరుక్కున్న ఆహారం 2 గంటలలోపు కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి దీని కారణంగా పంటి నొప్పి ఏర్పడుతుంది. దంతాలలో చిక్కుకున్న ఆహారం బ్యాక్టీరియా సల్ఫర్ సమ్మేళనాన్ని తయారు చేస్తుంది. ఇది నోటి దుర్వాసనకు కారణమవుతుంది. నోటి లోపల, నాలుక వెనుక, చిగుళ్ల కింది భాగంలో ఈ దుర్వాసన వెదజల్లుతుంది. వాస్తవానికి దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల దంతాల మీద ఒక పొర పేరుకుపోతుంది. అందులో ఏర్పడిన బ్యాక్టీరియా దంతాలను దెబ్బతీస్తుంది.

మనం రాత్రిపూట బ్రష్ చేయకపోతే ఆహారం పళ్ళలో చిక్కుకోవడం ప్రారంభమవుతుంది. రెండు గంటల తర్వాత ఆహారం లాలాజలంతో పాటు కుళ్ళిపోతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంది. దీని వల్ల చాలా సేపు ఇన్ఫెక్షన్, నోటిలో బొబ్బలు కూడా ఏర్పడుతాయి. సహజంగా పుప్పిళ్లు, దంతాళ్లో పగుళ్లు, చిగుర్లు ఉబ్బడం వల్ల పంటినొప్పి సమస్య వస్తుంది. అయితే పుప్పిళ్లు వంటి పెద్ద పెద్ద సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించాల్సిందే. అలా కాకుండా సాధారణ పంటి నొప్పి, చిగుళ్లు ఉబ్బడం వల్ల కలిగే నొప్పిని కొన్ని సహజ పద్ధతుల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.

పంటి నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటి బయోటిక్‌ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి నుంచి వెంటనే రిలీఫ్‌ అందిస్తుంది. వెల్లుల్లిని బాగా దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది. కొన్నిసార్లు దంతాల్లో పేర్కొన్న వ్యర్థాల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్‌ ద్వారా కూడా పంటి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి నోట్లో వేసుకొని బాగా పుకిలించాలి. దీంతో దంతాల చుట్టూ, మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News