Fennel Seeds: వేసవిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఇవి తప్పక తినాల్సిందే..!
Benefits Fennel Seeds in Summer: సోంపును మనం సాధారణంగా మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తుంటాం. ఆహారం తిన్న వెంటనే సోంపు తినడం చాలా మందికి ఓ అలవాటు.
Fennel Seeds: బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, వ్యాయామంతో పాటు మన కిచెన్‌లో దొరికే పదార్థాలతోనూ అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు. మన వంటిట్లో ఇలాంటి పదార్థాలు చాలానే ఉన్నాయి. వీటితో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అలాంటి వాటిలో సోంపు ఎంతో ముఖ్యమైనది. సోంపును మనం సాధారణంగా మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తుంటాం. ఆహారం తిన్న వెంటనే సోంపు తినడం చాలా మందికి ఓ అలవాటు.
ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడటమే కాకుండా, జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సోంపు కీలకంగా పనిచేస్తుంది. విటమిన్లు, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు సోంపులో ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వేసవిలో సోంపు తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే వేసవిలో మన శరీరాన్ని చల్లబరుస్తుందన్నమాట. వేసవిలో సోపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..
వేసవిలో సోపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది..
వేసవిలో సోంపు తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది కడుపులో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు..
వేసవిలో జీర్ణ సమస్యలు తరచుగా ప్రజలను ఇబ్బంది పెడతాయి. ఇటువంటి పరిస్థితిలో, సోంపు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి..
వేసవిలో బరువు తగ్గాలంటే, సోంపు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు జీవక్రియను పెంచడంలో ఇవి సహకరిస్తాయి.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి..
సోంపులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్, వైరస్ నుంచి మనల్ని రక్షిస్తుంది.
రక్తపోటు నియంత్రణకు..
సోంపు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.