Health News: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా.. జాగ్రత్త దీనికి చికిత్స లేదు..!

Health News: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా.. జాగ్రత్త దీనికి చికిత్స లేదు..!

Update: 2022-03-07 01:30 GMT

Health News: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా.. జాగ్రత్త దీనికి చికిత్స లేదు..!

Health News: క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, ఉబ్బసం, టిబి, ఎయిడ్స్, ఫ్లూ లేదా అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధుల గురించి మీరు వినే ఉంటారు. కానీ ప్రపంచంలో ఇలాంటి వ్యాధి గురించి మీరు విన్నారా.. ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఒక వ్యక్తి పరిస్థితిని దారుణంగా మారుస్తాయి. Ichthyosis వల్గారిస్ అనే వ్యాధి చాలా ప్రమాదం. దీనిని జెనెటిక్ వ్యాధి అని కూడా అంటారు. ఇది చర్మ వ్యాధి అంటే ఈ వ్యాధి వల్ల చనిపోయిన చర్మ కణాలు మీ చర్మం ఉపరితలంపై మందంగా, పొడిగా మారుతూ కనిపిస్తాయి. ఈ వ్యాధిలో మీ చర్మం పాములాగా తయారవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. దీనికి చికిత్స కూడా లేదు. 

మీడియా నివేదికల ప్రకారం.. దీని లక్షణాలు సాధారణంగా బాల్యంలోనే కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు చాలా సందర్భాలలో తేలికపాటివి. కానీ కొన్ని తీవ్రమైనవి కూడా ఉంటాయి. కొన్నిసార్లు తామర వంటి ఇతర చర్మ వ్యాధులు కూడా ఇచ్థియోసిస్ వల్గారిస్‌తో సంబంధం కలిగి ఉంటాయి. ఈ వ్యాధికి చికిత్స కనుగొనలేదు. ముందుగా తెలిస్తే పరిస్థితిని నియంత్రించడంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఒకవేళ మీ చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే డాక్టర్ మాత్రమే పరిస్థితిని అంచనా వేసి చికిత్స చేయగలడు. ఈ వ్యాధి లక్షణాలపై నిఘా ఉంచండి. అది తీవ్రమయ్యే ముందు వైద్యుడిని సంప్రదించండి. తీవ్రమైన సందర్భాల్లో మీకు బలమైన ఔషధం అవసరమని గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇది ఇతరులకు సోకకుండా ఉంటుంది.

Tags:    

Similar News