Sugarcane Juice Benefits: గ్లాసు చెరుకు రసం తాగితే లాభాలు ఎన్నో..!
Sugarcane Juice: వేసవి తాపాన్ని దూరం చేసుకునేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్ లేదా ఇతర షుగర్ బేస్ట్ సాఫ్ట్ డ్రింక్స్ తాగేందుకు ఇష్టపడతారు.
Sugarcane Juice: వేసవి తాపాన్ని దూరం చేసుకునేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్ లేదా ఇతర షుగర్ బేస్ట్ సాఫ్ట్ డ్రింక్స్ తాగేందుకు ఇష్టపడతారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు అలాగే పలు ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందేందుకు చెరుకురసం ఎంతో ప్రయోజనకారి.
చెరుకు రసం అనేది సహజ పానీయం. ఇందులో కొలెస్ట్రాలు ఉండవు. ఇందులో కొవ్వు, ఫైబర్, ప్రొటీన్లు ఉన్నప్పటికీ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా క్యాన్సర్ నుంచి మనల్ని రక్షించడంలో జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో,మూత్ర పిండాల పనితీరును మెరుగుపరచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో, రక్తహీనతను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది.
శరీరానికి తక్షణ శక్తి:
చెరుకురసంతో శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. వేసవిలో చెమటలు పట్టడం, మండే ఎండల వల్ల శరీరంలోని శక్తి అంతా హరించుకుపోయి డీహైడ్రేట్ అవుతుంది. తాజా చెరుకు రసం శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గం.
కాలేయ పనితీరు బలోపేతం:
చెరుకురసంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. చెరుకు రసం ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్డ్స్ గా ఉంచే విషయంలో సహాయపడుతుంది. కామెర్లు వచ్చినప్పుడు చెరుకు రసం తాగమని సలహా ఇవ్వడానికి కారణం ఇదే.
క్యాన్సర్ తో పోరాడే సామర్థ్యం:
చెరుకు సరంలో ఉండే పాలీఫెనాల్స్ అధిక యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే చెరకు రసంలో క్యాన్సర్ తో పోరాడే శక్తి ఉంది.
జీర్ణవ్యవస్థను శక్తివంతం చేస్తుంది:
జీర్ణవ్యవస్థను బలోపేతం చేసే విషయంలో కూడా చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం పొట్టలోని PH స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. కడుపులో వచ్చే ఇన్ ఫెక్షన్లను నివారించడంలోనూ సహాయపడుతుంది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మేలు:
చెరుకురసంలో చక్కెర ఉన్నప్పటికీ మధుమేహ రోగులు పరిమితంగా తీసుకుంటే మంచిదే. ఇందులో ఉండే సహజ చక్కెర తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో పెరుగుదలను నివారిస్తుంది. చెరుకులో మధుమేహాన్ని మెరుగ్గా నిర్వహించే వివిధ పాలీఫెనాల్స్ ఉన్నాయి.
మూత్రపిండాల పనితీరు మెరుగు:
చెరుకు రసంలో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. ఇందులో చాలా తక్కువ సోడియం ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో సంతృప్త కొవ్వు కూడా ఉండదు. ఇది కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
సైడ్ ఎఫెక్స్:
చెరుకు రసం తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే చెరుకులో ఉండే పొలికోసనాల్ అనే పదార్థం కారణంగా దీన్ని అధికంగా వినియోగిస్తే నిద్రలేమి, కడుపునొప్పి, తలతిరగడం, తలనొప్పి, బరువు కోల్పోవడం ఇలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. అలాగే రక్తాన్ని పల్చగా, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది.