Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. ఈ పద్దతులను పాటించండి..!

Dandruff: చుండ్రు సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది...

Update: 2022-03-17 08:28 GMT

Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. ఈ పద్దతులను పాటించండి..!

Dandruff: చుండ్రు సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. స్త్రీలే కాకుండా పురుషులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా తగ్గడం లేదు. ఈ పరిస్థితిలో తల నుంచి చుండ్రుని వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలని తెలుసుకుందాం. వీటిని పాటించడం ద్వారా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. బేకింగ్ సోడా చుండ్రును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

షాంపూతో తలస్నానం చేసే సమయంలో దాంట్లో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి తలకు బాగా మర్దన చేయాలి. ఆపై తలను కడగాలి. దీంతో తలలో పేరుకుపోయిన చుండ్రు బయటకు వెళ్లిపోతుంది. అలోవెరా జెల్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ సంరక్షణలో జుట్టు సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది చుండ్రు సమస్యకి చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు.

అలోవెరా జెల్‌ను తలపై పూర్తిగా అప్లై చేయండి. 20-25 నిమిషాల పాటు ఉంచిన తర్వాత తలను బాగా కడగండి. చుండ్రు మాయమైపోతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రును తొలగించడంలో ఉపయోగపడుతుంది. దీని కోసం ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్, సమాన పరిమాణంలో నిమ్మరసం తీసుకుని, రెండు రెట్లు ఎక్కువ నీరు కలిపి ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి జుట్టుపై చల్లుకోండి.

20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత తలని కడగండి. దీంతో చుండ్రు సమస్య తగ్గుతుంది. కొబ్బరి నూనె కూడా చుండ్రుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. ఇప్పుడు తలను నూనెతో బాగా మసాజ్ చేసి అరగంట పాటు ఉంచిన తర్వాత శుభ్రంగా తలను కడగాలి. ఇది ఖచ్చితంగా మీ తలలో చుండ్రును తగ్గిస్తుంది.

Tags:    

Similar News