Health Tips: కోడి గుడ్లను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తున్నారా?అయితే ప్రమాదంలో పడ్డట్టే.. ఎందుకుంటే

Health Tips: కోడిగుడ్లు ప్రోటీన్ లకు చక్కటి మూలం మన శరీరంలో కండరాల నిర్మాణానికి ప్రోటీన్లు అనేది అత్యవసరం. డయాబెటిక్ పేషెంట్లు సైతం కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉండే అన్నం, చపాతీలకు బదులుగా కోడిగుడ్లను తినమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.

Update: 2024-07-12 05:27 GMT

Health Tips: కోడి గుడ్లను రిఫ్రిజరేటర్లో స్టోర్ చేస్తున్నారా?అయితే ప్రమాదంలో పడ్డట్టే.. ఎందుకుంటే

Health Tips:కోడిగుడ్లు ప్రోటీన్ లకు చక్కటి మూలం మన శరీరంలో కండరాల నిర్మాణానికి ప్రోటీన్లు అనేది అత్యవసరం. డయాబెటిక్ పేషెంట్లు సైతం కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉండే అన్నం, చపాతీలకు బదులుగా కోడిగుడ్లను తినమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. . అయితే కోడిగుడ్లు తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ లో ఉంచిన కోడిగుడ్లను ఎక్కువగా తినకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.

రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన గుడ్లను ఎందుకు తినకూడదో తెలుసుకుందాం. గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటిని సురక్షితంగా ఉంచగలమని అందరూ అనుకుంటారు. అయితే గుడ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పోషకాలు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు రిఫ్రిజిరేటర్ లో కోడిగుడ్లను ఉంచడం వల్ల వాటిపై ఉన్నటువంటి పెంకు భాగము గడ్డకట్టే ప్రమాదం ఉంది అలాంటప్పుడు దాని లోపల ఉన్నటువంటి పదార్థంలో టాక్సిన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. రిఫ్రిజిరేటర్ లో కోడిగుడ్లను రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంచినట్లయితే ఆ కోడిగుడ్లను తినకుండా ఉండటం మంచిది.

రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పుడు గుడ్లు తాజాగా ఉంటాయి. కానీ తక్కువ ఉష్ణోగ్రతలో వాటి రుచితో పాటు వాటి పోషకాలను నాశనం చేస్తుంది. సాల్మొనెల్లా బాక్టీరియా వృద్ధి చెందకుండా ఉండాలంటే గుడ్లను సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా గుడ్లను కలుషితం చేస్తుంది. అయితే గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటిపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాంటప్పుడు బ్యాక్టీరియా చల్లటి వాతావరణంలో గుడ్డు లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది.

రిఫ్రిజిరేటర్‌లో నుంచి బయటకు తీసి గుడ్లను వేడినీటిలో వేసి ఉడకబెడితే అవి పూర్తిగా ఉడకకముందే మధ్యలోనే పగిలే అవకాశం ఉంది. కాబట్టి మీరు రిఫ్రిజిరేటర్ నుండి గుడ్డును తీసిన తర్వాత దానిని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి గదిలో కొంత సమయం పాటు మూత పెట్టకుండా గిన్నెలో ఉంచండి.

ఒక్కోసారి గుడ్డు పైభాగం మురికిగా ఉంటే, అది ఫ్రిజ్‌లోని ఇతర వస్తువులకు సోకుతుంది. ఫ్రిజ్ వాసన కూడా వస్తుంది. చాలా రోజులుగా ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లను తినకూడదు, అవసరమైతే, మీరు వాటిని తినాలనుకున్నప్పుడు మాత్రమే గుడ్లు కొనండి.

Tags:    

Similar News