Health Tips: ఇంట్లో ఉండి కొలస్ట్రాల్ తగ్గించండి.. మాత్రలు అవసరం లేదు..!
Health Tips: ప్రస్తుతం లక్షలాది మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు
Health Tips: అధిక కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అంటారు. ప్రస్తుతం లక్షలాది మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ రెండు రకాలు మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్‌ను హై డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL) అంటారు. రక్త ప్రసరణ కణాల ఏర్పాటుకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్‌ను తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటారు. ఇది ప్రమాదకరమైనదిగా చెబుతారు. ఇది రక్త కణాలలో పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహం తగ్గుతుంది. లేదా పూర్తిగా ఆగిపోతుంది. దీని కారణంగా మీరు గుండె జబ్బుల వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ గుండెకు రక్తం, ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే రక్త కణాలను అడ్డుకుంటుంది.
శరీరకంగా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ముందుగా కొలెస్ట్రాల్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి. రిపోర్ట్‌లో కొలస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో మందులు లేకుండా సహజ పద్ధతుల ద్వారా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం.
బరువు తగ్గండి
మీరు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించాలనుకుంటే ముందుగా ఊబకాయం, బరువును తగ్గించుకోవడం ముఖ్యం. నిజానికి పొట్ట చుట్టూ బెల్లీ ఫ్యాట్ పెరగడం వల్ల కాలేయాన్ని ప్రభావితం చేసే విసెరల్ ఫ్యాట్ పెరుగుతుంది. బరువు తగ్గడానికి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎక్కువ నీరు తాగడం అవసరం.
మద్యపానం
మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే మద్యం సేవించడం మానేయాలి. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని గమనించండి.
ధూమపానం
ధూమపానం గుండె, హృదయ స్పందన రేటుపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ధూమపానం మానేయడం వల్ల రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుచుకోవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
వ్యాయామం
మీరు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించాలనుకుంటే కనీసం రోజంతా మీ శారీరక శ్రమను పెంచుకోవడం అవసరం. మీరు స్విమ్మింగ్, వాకింగ్, సైక్లింగ్, డ్యాన్స్ మొదలైన మీ ఇష్టమైన కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. ఎక్కువ సమయం కూర్చోకుండా ఉండటం ముఖ్యం. ప్రతి అరగంటకు లేచి కొద్దిసేపు నడవాలి.