Heart Attack: గుండెపోటు రాకూడదంటే ఈ పనులు తప్పనిసరి..!

Heart Attack: ఒక మనిషి ఫిట్‌గా ఉండాలంటే ముందుగా అతడి గుండె కూడా ఫిట్‌గా ఉండాలి.

Update: 2022-04-22 13:30 GMT

Heart Attack: గుండెపోటు రాకూడదంటే ఈ పనులు తప్పనిసరి..!

Heart Attack: ఒక మనిషి ఫిట్‌గా ఉండాలంటే ముందుగా అతడి గుండె కూడా ఫిట్‌గా ఉండాలి. దేశంలో ఎక్కువ మంది గుండెపోటుతో మరణిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుకోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. ధూమపానం చేయవద్దు

ధూమపానం అస్సలు చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడుతాయి. అందుకే ధూమపానం వెంటనే మానేస్తే ఆరోగ్యానికి మంచిది.

2. రోజువారీ ధ్యానం చేయండి

మీ జీవితంలో ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. ఎందుకంటే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెడిటేషన్ చేయడం చాలా ముఖ్యం. యోగా సహాయంతో ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. రోజువారీ ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. తగినంత నిద్ర పోవాలి

మీకు తగినంత నిద్ర ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నిజానికి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 7 నుంచి 8 గంటల నిద్రపోవాలి. నిద్ర లేకపోవడం ఒత్తిడిని పెంచుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి తగినంత నిద్ర పోవడానికి ప్రయత్నించండి.

4. బరువును అదుపులో ఉంచుకోండి

బరువు నియంత్రణ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముడతాయి. ఈ పరిస్థితిలో అదనపు చక్కెరను తినకుండా ఉండాలి. లేదంటే మధుమేహ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి.

5. హృదయ స్పందన రేటును గమనించండి

దీంతో పాటు హృదయ స్పందన రేటును గమనించండి. మీ BMI 25 కంటే ఎక్కువ, మీ నడుము 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే మీరు గుండె వ్యాధులకి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

Tags:    

Similar News