Health Tips: ఇవి తింటే గుండెపోటు ప్రమాదం తక్కువ.. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: వృద్ధాప్యంలో రావాల్సిన గుండె జబ్బులు చిన్న వయసులోనే వస్తున్నాయి.

Update: 2023-06-01 15:30 GMT

Health Tips: ఇవి తింటే గుండెపోటు ప్రమాదం తక్కువ.. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..

Health Tips: ఈరోజుల్లో చాలామంది గుండెపోటు బారినపడి అకాలంగా మరణిస్తున్నారు. వృద్ధాప్యంలో రావాల్సిన గుండె జబ్బులు చిన్న వయసులోనే వస్తున్నాయి. దీనికి కారణం జీవనశైలి సరిగ్గాలేకపోవడం, చెడు ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో గుండెపోటు అనేది ప్రాణాలకి పెద్ద ముప్పుగా తయారైంది. సరైన సమయంలో సరైన వైద్యం అందకుంటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని నివారించడానికి కొన్నిరకాల ఆహారాలు తినాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

గింజలు

రోజూ రకరకాల గింజలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఎందుకంటే గింజలలో అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, అమినో యాసిడ్‌లు గుండెకు మేలు చేస్తాయి.

తృణధాన్యాలు

బ్రౌన్ రైస్, పాప్‌కార్న్ వంటి తృణధాన్యాల నుంచి తయారైన ఆహారాలు గుండెకు చాలా మంచివని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి అధిక ఫైబర్ కలిగి ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

వెల్లుల్లి

వంటకం రుచి పెంచాలంటే అందులో కచ్చితంగా వెల్లుల్లి వేయాల్సిందే. అంతే కాకుండా ఇందులో ముఖ్యమైన ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అయితే హృదయాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వెల్లుల్లిని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.

పప్పులు

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఆహారంలో పప్పులను చేర్చుకోవాలి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది.

Tags:    

Similar News