Health Tips: బచ్చలి, మెంతికూరలో అద్భుత ఔషధ గుణాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!
Health Tips: బచ్చలి, మెంతికూరలో అద్భుత ఔషధ గుణాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!
Health Tips: వాతావరణం మారుతున్న కొద్దీ మనుషుల జీవన విధానంలో మార్పు సంభవిస్తుంది. అయితే శీతాకాలంలో అనేక ఆకుకూరలు ఉంటాయి. వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలలో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు ఈ సీజన్‌లో ప్రజలు బచ్చలికూర,మెంతికూర తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈ రెండు వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
బచ్చలికూరలో పోషకాలు
ఎవరైనా ఐరన్ లోపిస్తే బచ్చలికూర తినమని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మాత్రమే కాదు బచ్చలికూరలో కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ కె వంటి అనేక ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బచ్చలికూరలో ఉండే పోషకాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మలబద్ధకం, క్యాన్సర్ వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
మెంతికూరలో పోషకాలు
మెంతికూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కేలరీల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మెంతులు ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. అదనంగా మెంతులు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. చలికాలంలో మెంతికూర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
బచ్చలికూర రక్తం గడ్డకట్టడాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. మధుమేహ రోగులు వైద్యుల సలహా లేకుండా బచ్చలికూరను తినరాదు. తక్కువ కేలరీల ఆహారం కావాలంటే మెంతికూర తినవచ్చు. వీటిలో బచ్చలికూర కంటే తక్కువ కార్బ్ కంటెంట్ ఉంటాయి. అయితే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల మెంతికూరలో 2.9 గ్రాముల పిండి పదార్థాలు, 4 గ్రాముల ప్రోటీన్లు, 100 గ్రాముల బచ్చలికూరలో 6 గ్రాముల పిండి పదార్థాలు, 2 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి.