Health Tips: వర్షాకాలంలో ఇలా చేస్తే వ్యాధులకి దూరం.. లేదంటే భారీ మూల్యం తప్పదు..!

Health Tips: వర్షాకాలం వర్షాలతో పాటు వ్యాధులను కూడా తెస్తుంది.

Update: 2022-08-11 12:00 GMT

Health Tips: వర్షాకాలంలో ఇలా చేస్తే వ్యాధులకి దూరం.. లేదంటే భారీ మూల్యం తప్పదు..!

Health Tips: వర్షాకాలం వర్షాలతో పాటు వ్యాధులను కూడా తెస్తుంది. రోగాలని వ్యాప్తి చేసే వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఈ సీజన్‌లో యాక్టివ్‌గా ఉంటాయి. ఈ సమయంలో జలుబు చేయడం సర్వసాధారణం. చాలామంది జ్వరానికి గురవుతారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ సీజన్‌లో ఇబ్బంది ఎక్కువ. వర్షాకాలంలో అనేక రకాల జ్వరాలను కలిగించే వైరస్‌లు-బ్యాక్టీరియాలు చురుకుగా ఉంటాయి. చాలా సందర్భాలలో వైరల్ ఫీవర్ వస్తుంది. ఈ కాలంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రోగనిరోధక శక్తిని పెంచే పండ్లను ఎక్కువగా తినాలి. ఆరెంజ్, మోసాంబి మొదలైన విటమిన్ సి ఉన్న పండ్లను తినాలి. వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. అపరిశుభ్రమైన నీటిని తాగడం అనారోగ్యానికి అతి పెద్ద కారణం. కాబట్టి వర్షాకాలంలో నీటిని మరిగించి తాగాలి. ఆహారంలో చల్లగా కాకుండా వేడి పదార్థాలను చేర్చండి. ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తినవద్దు.

పసుపు, అల్లం, లవంగం, గరంమసాలా, ఇంగువ, బెల్లం వంటి వేడి పదార్థాలను ఆహారంలో కలుపుకుంటే చాలా మంచిది. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇది డీ-హైడ్రేషన్‌కు కారణం కాదు. రోజూ పండ్ల రసం తాగాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసితో అల్లం టీ తాగవచ్చు. వాంతులు, అతిసారం సమస్య ఉంటే నిమ్మ-నీరు లేదా ఎలక్ట్రోల్ తాగాలి. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా చేర్చుకుంటే మంచిది.

వెల్లుల్లిని రోజూ తీసుకోవాలి. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు నివారిస్తుంది. యాపిల్, అరటి, నారింజ వంటి పండ్లను తినాలి. టొమాటో, పొటాటో వెజిటబుల్ కూడా మంచివే. ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని ఆహారాన్ని తినవద్దు. వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా చల్లటి ఆహారంలో దాగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.

Tags:    

Similar News