Ways to Relieve Stress: టెన్షన్ పడుతున్నారా... అయితే ఇలా చేయండి
Relieve Stress & Anxiety: సరైన ఆహారపదార్థాలను తీసుకుంటూ ఇష్టమైన పనులను చేసుకుంటూ వుంటే టెన్షన్ నుండి రిలీఫ్ పొందవచ్చు.
Ways to Relieve Stress: టెన్షన్.. టెన్షన్..టెన్షన్ మారుతున్న వర్తమాన కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటున్న సమస్య. అయితే కొంత మంది ప్రతి చిన్నదానికి టెన్షన్ పడుతుంటే.. మరి కొందరు మనస్సు నిగ్రహించుకుంటూ వుంటారు. ఈ ఒత్తిడి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది. ఏదేని సందర్భంలో తీవ్రమైన ఒత్తిడికి లోనైపుడు కొన్ని క్షణాలు లేదా నిమిషాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో మన 'లైఫ్ స్టైల్' లోతెలుసుకుందాం.
- ప్రతి పనిలో ఎదుటి వారిని అర్థం చేసుకుంటూ ప్రయాణం సాగించాలి. అదే సమయంలో నేర్పు, ఓర్పును అలవరచుకోవాలి. అనుభవం గడించిన పెద్దల సహకారంతో సమస్య పరిష్కారానికి పూనుకోవాలి.
- ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిలబడాలి. తల, వెన్ను, భుజాలని నిటారుగా ఉంచుకుని నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. ప్రాణామాయం చేస్తూ వుండాలి.
- పచ్చటి మొక్కలను పెంచుకోవడం లేదా దగ్గరలో వున్న మొక్కల వద్దకు వెళ్లి వాటిని ఆస్వాదించడం వంటి చేస్తూ వుండాలి. లేదా పెంపుడు జంతువును పెంచుకోవడం, వాటితో సమయం గడపటం వంటివి చేస్తూ వుంటే టెన్షన్ నుండి రిలీఫ్ పొందవచ్చు.
- ఇష్టమైన మ్యూజిక్, ఇష్టమైన ఆహారం తయారు చేసుకోవడం, తినడం, షాపింగ్, డ్యాన్సింగ్, రన్నింగ్ వంటి వాటిని చేస్తూ వుంటే టెన్షన్ ఫీలింగే వుండదు.
- నవ్వడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, వాటి బదులుగా ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నవ్వడమో, నవ్వేందుకు ఇష్టమైన కామెడీ సన్నివేశాన్ని చూడటమో చేయవచ్చు.
- పొటాషియం ఒత్తిడిని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. పొటాషియం వుండే ఆహార పదార్థాలు కమలాపండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్. వీటిలో మనిషిలోని మెదడుకు బలాన్ని చేకూర్చుతుంది.
- బంగాళా దుంపలో విటమిన్ బీ గ్రూపునకు చెందిన విటమిన్లుంటాయి. దీంతో ఒత్తిడిని దూరం చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- బియ్యం, చేపలు, బీన్స్, ధాన్యాలలో విటమిన్ బీ అధికంగా ఉంటుంది. దీంతో ఇవి ఆహారంగా తీసుకోవడం వలన మెదడుకు సంబంధించిన జబ్బులను, ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి.
- మెగ్నీషియం కూడా ఒత్తిడిని తగ్గించేదుకు ఉపయోగపడుతుంది. మెగ్నీషియం వుండే పదార్థాలు ఆకు కూరలు, గోధుమలు, సోయాబీన్, వేరుశెనగ గింజలు, మామిడి పండు, . శబ్దమే కాదు, స్పర్శ కూడా ఉద్వేగాన్ని దూరం చేస్తుంది. మనకి ఇష్టమైన వస్తువుని పట్టుకుని ఉండటమో, రబ్బర్ బాల్‌ని చేత్తో నొక్కడమో, వేడినీటితో స్నానం చేయడమో, వెచ్చటి దుప్పటిని కప్పుకోవడమో... ఉద్వేగం నుంచి తప్పుకుండా దూరం చేస్తాయి. అరటిపండ్లు
ఏది ఏమైనప్పటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ వుంటే టెన్షన్ నుండి రిలీఫ్ పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి సరైన వ్యాయామం చేస్తూ పొషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ శరీరంలో ఇమ్యూనిటీలను పెంచుకుంటూ వుంటే ఇలాంటి సమస్యలకు చక్కగా పరిష్కారం దొరుకుతుంది.