Holi Festival: 'హోలీ' ఎందుకు జరుపుకుంటారు?
Holi 2023: సంవత్సరంలో ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి.
Holi 2023: సంవత్సరంలో ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. పాల్గొన్న మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీని జరుపుకుంటారు.
హోలీ పండుగ జరుపుకునేందుకు ఒక ఇతిహాసం ఉందట. పూర్వము రాక్షస రాజు.. హిరణ్యకశ్యపుడి.. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు.. అది హిరణ్యకశ్యపుడికి నచ్చదు దీంతో భక్త ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలలో ఆహుతి చేయమని కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుందట. ఇక ఆమె దహనమైన రోజునే హోళి అని పండుగను పిలుస్తారని ప్రచారంలో ఉంది.
కొన్ని ప్రాంతాలలో రాత్రి సమయాలలో హోళికా దహనం చేస్తూ ఉంటారు. పూర్వం ఈ పండుగ రోజున రకరకాల పూలను ఒకరిపై ఒకరు చల్లుకునే ఉండేవారు అలా వారి యొక్క సంతోషాన్ని పంచుకుంటూ ఉండేవారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఈ రంగులను నీళ్ళలో కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమతో పాటు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయని అందరూ భావిస్తారు. ఇక అప్పట్లో శ్రీకృష్ణుడు గోపికలతో కలసి బృందావనంలో పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఇలా చేయడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం.