Onion Side Effects: ఉల్లిపాయలు ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

Onion Side Effects: పచ్చి ఉల్లిపాయ తినడం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ దానిని అధికంగా తీసుకుంటే శరీరానికి మంచిది కాదు.

Update: 2022-05-11 10:30 GMT

Onion Side Effects: ఉల్లిపాయలు ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

Onion Side Effects: పచ్చి ఉల్లిపాయ తినడం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ దానిని అధికంగా తీసుకుంటే శరీరానికి మంచిది కాదు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉల్లిపాయలు అధికంగా తింటే కడుపు నొప్పి, రక్తంలో చక్కెరను పెంచే సమస్యలు ఏర్పడవచ్చు. ఉల్లిపాయల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కొందరికి జీర్ణం అవడం చాలా కష్టం. ఈ పరిస్థితిలో ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.

డయాబెటిక్‌ పేషెంట్లు పచ్చి ఉల్లిపాయ తినేటప్పుడు వైద్యుడి సలహా తీసుకోవాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువగా పచ్చి ఉల్లిపాయను తింటే ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది. ఇది గుండెల్లో మంట సమస్యను కలిగిస్తుంది. అందుకే ఉల్లిపాయని ఎక్కువగా తీసుకోకూడదు. దీంతో పాటు మీరు నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ పరిస్థితిలో ఉల్లిపాయలను ఎక్కువగా తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీరు తిన్నప్పటికీ వెంటనే నోటిని శుభ్రం చేసుకుంటే మంచిది.

పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిదే అయితే అది పరిమితిలో తింటే మాత్రమే. ఎక్కువగా తింటే సాల్మొనెల్లా వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతారు. సాల్మొనెల్లా అనేది ఆహార సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బాక్టీరియా పేగులను ప్రభావితం చేస్తుంది. వివిధ రకాల కడుపు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను సాల్మొనెలోసిస్ అంటారు. ఇది మానవ పేగులలో నివసిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఉనికిని సులువుగా గుర్తించలేం. ఇది ఎక్కువగా పచ్చి లేదా తక్కువగా ఉడకబెట్టిన మాంసం, పౌల్ట్రీ, గుడ్లు లేదా గుడ్డు ఉత్పత్తుల వినియోగం కారణంగా ఏర్పడుతుంది.

Tags:    

Similar News