Health Tips: పాలు చల్లగా తాగాలా.. వేడిగా తాగాలా.. ప్రయోజనాలు ఎలా ఉంటాయి..!

Health Tips: అన్ని రకాల పోషకాలు ఉండటం వల్ల పాలని సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు.

Update: 2022-08-09 15:30 GMT

Health Tips: పాలు చల్లగా తాగాలా.. వేడిగా తాగాలా.. ప్రయోజనాలు ఎలా ఉంటాయి..!

Health Tips: అన్ని రకాల పోషకాలు ఉండటం వల్ల పాలని సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్, అనేక రకాల ప్రొటీన్లు ఉంటాయి. ప్రజలు వివిధ మార్గాల్లో పాలు తాగడానికి ఇష్టపడతారు. కొంతమంది సాధారణ పాలు తాగడానికి ఇష్టపడితే మరికొందరు వేడిగా తాగుతారు. అయితే చల్లటి పాలు మంచివా, వేడిపాలు మంచివా అనే విషయంలో చాలామంది తర్జన భర్జన పడుతారు. ఏవి మంచివో తెలుసుకుందాం.

వేడి పాల వల్ల కలిగే ప్రయోజనాలు

గోరువెచ్చని పాలు, తేనె కలిపి తాగడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తాయి. పాలలో తేనె కలిపి తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి పాలు త్వరగా జీర్ణమవుతాయి. ఇందులో ఉండే లాక్టియం అనే ప్రొటీన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. చల్లని రోజుల్లో వేడి పాలు తాగడం ద్వారా మీ శరీర ఉష్ణోగ్రతను సహజంగా పెంచుకోవచ్చు. ఇది శరీరాన్ని తేమ నుంచి రక్షిస్తుంది. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రకు ఉపకరిస్తుంది. కాబట్టి మీరు రాత్రి త్వరగా పడుకోవాలంటే గోరువెచ్చని పాలు తాగితే సులువుగా నిద్రపోవచ్చు.

చల్లటి పాలు వల్ల కలిగే ప్రయోజనాలు

చల్లటి పాలు తాగడం వల్ల అసిడిటీ తొలగిపోతుందిక. ఎందుకంటే ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువ ఆమ్లం ఏర్పడటానికి అనుమతించదు. వీటిని రోజూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, శుభ్రంగా తయారవుతుంది. అయితే మీరు పాలు ఎలా తాగినా చర్మానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ ముఖానికి మెరుపును ఇస్తుంది. చర్మం ఎల్లప్పుడూ శుభ్రంగా, టోన్‌గా కనిపిస్తుంది. కాకపోతే ఎవరి అభిరుచి ప్రకారం వారు తాగడానికి ఇష్టపడుతారు.

Tags:    

Similar News