Sanitizer: జాగ్ర‌త్త‌.. శానిటైజ‌ర్ల‌ను అతిగా వాడ‌కండి.

Sanitizers: మాన‌వాళిని కరోనా మ‌హ‌మ్మారి అల్లాడిస్తుంది. రోజురోజుకూ ఈ మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతుం‌ది. ఇప్ప‌టికే చాలా మంది ఈ వైర‌స్ బారిన ప‌డి బ‌ల‌య్యారు

Update: 2020-08-30 18:25 GMT

Sanitizers 

Sanitizers: మాన‌వాళిని కరోనా మ‌హ‌మ్మారి అల్లాడిస్తుంది. రోజురోజుకూ ఈ మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతుం‌ది. ఇప్ప‌టికే చాలా మంది ఈ వైర‌స్ బారిన ప‌డి బ‌ల‌య్యారు  ఈ క్లిష్ట ప‌రిస్థితిలో మనల్ని మ‌నం ర‌క్షించుకోవాలంటే కేవ‌లం అది వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌తోనే సాధ్యం. ఇందుకోసం చాలా మంది మాస్కులు, శానిటైజర్లను వాడటం మొద‌లు పెట్టారు. అయితే .. చాలా మంది శానిటైజ‌ర్ల‌ను ఇష్టానుసారంగా వాడుతున్నారు. అధికంగా వాడితే.. చాలా ఇబ్బందులు వ‌స్తాయ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.  కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కూడా ఇదే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. శానిటైజర్ కంటే సబ్బుతో చేతులు కడుక్కోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. మీ చేతులు కడుక్కోవడానికి అవకాశం లేకపోతేనే.. శానిటైజర్ వాడండని అంటున్నారు.

శానిటైజర్ ఉప‌యోగించటంలో ప్ర‌ధాన ఉద్దేశ్యం.. చేతుల‌ను క్రిమిరహితం చేయడం. శానిటైజర్ వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటి నుండి విముక్తి చేస్తుంది. శానిటైజర్లను అధికంగా వాడటం వల్ల చర్మ సమస్యలు కాగా.. ఇత‌ర స‌మ‌స్య‌లు తలెత్తుతాయ‌ని నిపుణులు తెలుపుతున్నారు. బ్యాక్టీరియాను చంపడంలో ప్రభావవంతమైన హ్యాండ్ శానిటైజర్లు మైక్రో బయోమ్‌లకు హాని కలిగించవచ్చు, అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతాయి. శానిటైజర్ ని ఎక్కువగా వాడ‌టం వ‌ల్ల చర్మ సమస్యలు, చేతులు బాగా పొడిబారడం, చేతులు మంటలు రావడం, చర్మం ఎర్రబడటం వాటితో పాటు పగుళ్లు, రక్తస్రావం కూడా సంభవిస్తున్నాయని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.

జాగ్రత్తలు: 

శానిటైజర్ ను  పరిమితంగా వాడాలి. 

బయటికి వెళ్లినప్పుడు అనవసరమైన వస్తువులను తాకకుండా ఉండండి.

చేతులు కడుక్కోవడానికి ఎంపిక లేకపోతే .. కొందరు తినడానికి ముందు శానిటైజర్ వాడవచ్చు.

 బస్సు, రైలు లేదా పబ్లిక్ వాహనంలో ప్రయాణించేటప్పుడు మీరు పదేపదే హ్యాండిల్ పట్టుకున్నప్పుడు శానిటైజర్ వాడండి,

ఇంట్లో ఉంటే .. సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

మీరు బయటి నుండి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు శరీరంపై శానిటైజర్‌ను పిచికారీ చేయండి.ఈ సమయంలో స్ప్రే బట్టలపై బ్యాక్టీరియాను చంపుతుంది.

ఒకవేళ మీ చేతులు పొడిగా లేదా సున్నితంగా మారినట్లయితే లేదా చేతి శానిటైజర్లను ఉపయోగించిన తర్వాత మీ చర్మంపై పగుళ్లు ఏర్పడితే, మాయిశ్చరైజర్లను రాసుకుంటే ఫలితం ఉంటుంది. 

Tags:    

Similar News