Health: రన్నింగ్‌ లేదా స్కిప్పింగ్‌.. బరువు తగ్గడానికి ఏది బెటర్..!

Health: ప్రస్తుత కాలంలో ప్రజలు బరువు పెరగడం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తగ్గించుకోవడానికి స్కిప్పింగ్‌ లేదా రన్నింగ్‌ చేస్తారు.

Update: 2022-04-09 10:30 GMT

Health: రన్నింగ్‌ లేదా స్కిప్పింగ్‌.. బరువు తగ్గడానికి ఏది బెటర్..!

Health: ప్రస్తుత కాలంలో ప్రజలు బరువు పెరగడం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తగ్గించుకోవడానికి స్కిప్పింగ్‌ లేదా రన్నింగ్‌ చేస్తారు. అధిక బరువు ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ మొదలైన అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఎలాగైనా బరువు తగ్గాలని అనుకుంటారు. చాలా మంది బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తుంటే కొందరు దీని కోసం వ్యాయామాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే చాలామంది స్కిప్పింగ్‌ లేదా రన్నింగ్‌ ఎంచుకుంటున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.

స్కిప్పింగ్‌ ప్రయోజనాలు

రోజూ 10 నిమిషాలు స్కిప్పింగ్‌ చేయడం వల్ల శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరం కండరాలను బలపరుస్తుంది. అలాగే మోకాలు, చీలమండలను సమతుల్యం చేస్తుంది. చాలా మంది వ్యక్తులు రన్నింగ్‌ చేయలేరు. ఈ సందర్భంలో వారు స్కిప్పింగ్‌ చేయడం ద్వారా తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. స్కిప్పింగ్ చేయడం వల్ల కాళ్లు, మోకాళ్లు, నడుము కండరాలు బలంగా తయారవుతాయి. మీరు ఊబకాయంతో ఇబ్బంది పడుతుంటే రెగ్యులర్ స్కిప్పింగ్ చేయవచ్చు. దీనివల్ల కేలరీలు వేగంగా కరిగిపోతాయి. కేలరీలు బర్న్ చేయడానికి రన్నింగ్ కంటే జంపింగ్ ఉత్తమ ఎంపిక.

రన్నింగ్ ప్రయోజనాలు

వాస్తవానికి మెదడులో ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ వంటి రసాయనాలను విడుదల చేయడానికి రన్నింగ్ సహాయపడుతుంది. ఇది ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. పరుగుతో పాటు డిప్రెషన్ దూరమై నిద్ర బాగా వస్తుంది. ఊపిరితిత్తులు క్లియర్ చేయబడుతాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి రన్నింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజువారీ పరుగు ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మం సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది.

ఇది శ్వాసకోశ కండరాలను బలపరుస్తుంది. పరుగు ద్వారా ఊపిరితిత్తుల పనితీరు పెరుగుతుంది. రోజూ రన్నింగ్ చేయడం వల్ల మీ హృదయనాళ వ్యవస్థ మెరుగుపడుతుంది. పరుగు ద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రన్నింగ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Tags:    

Similar News