Health Tips: డ్రై స్కిన్‌ని తొలగించాలంటే ఇదొక్కటి చాలు.. ఖర్చు కూడా ఉండదు..!

Health Tips: చలికాలంలో పొడి చర్మం సర్వసాధారణం.

Update: 2023-01-02 14:30 GMT

Health Tips: డ్రై స్కిన్‌ని తొలగించాలంటే ఇదొక్కటి చాలు.. ఖర్చు కూడా ఉండదు..!

Health Tips: చలికాలంలో పొడి చర్మం సర్వసాధారణం. దీని కోసం చాలామంది ఆయిల్, క్రీమ్ అప్లై చేస్తారు. కానీ ఇది తాత్కాలిక ఉపశమనమే. ఇందుకోసం పచ్చిపాలని ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇందులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు, లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ బి, విటమిన్ డి చర్మానికి చాలా మేలు చేస్తాయి. అనేక చర్మ సంరక్షణ, సౌందర్య ఉత్పత్తులలో పాలు ఉపయోగిస్తారు.

మృదువైన చర్మం

చాలా మంది చర్మం సహజంగా పొడిగా ఉంటుంది. అలాంటప్పుడు వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిస్థితిలో రసాయన ఆధారిత చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తే చర్మం దెబ్బతింటుంది. రాత్రి పడుకునే ముందు పొడిబారిన చర్మంపై పచ్చి పాలను రాసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 2 చెంచాల పచ్చి పాలను తీసుకుని కాటన్ బాల్స్ సహాయంతో ముఖానికి రాసుకుని నిద్రకు ఉపక్రమించాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ముఖం కడుక్కోవాలి.

పచ్చి పాలు, అరటిపండు

పచ్చిపాలలో అరటిపండును కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. అరటిపండు సహాయంతో చర్మంపై ఉండే తేమను లాక్ చేయవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో పచ్చి పాలను తీసుకొని అరటిపండును కలపాలి. తేలికపాటి చేతులతో ముఖం మీద అప్లై చేసి సుమారు 20 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.

పచ్చి పాలు, తేనె

పచ్చి పాలు, తేనె కలయిక చర్మం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెప్పవచ్చు. ఇది చర్మాన్ని బాగా తేమ చేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 2 చెంచాల పచ్చి పాలను తీసుకుని 1 చెంచా తేనె కలపాలి. ఇప్పుడు ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్‌తో శుభ్రం చేసుకోవాలి.

Tags:    

Similar News