Ratan Tata Love Story: యుద్ధం విడదీసిన ప్రేమకథ..రతన్ టాటా లవ్ స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు

Ratan Tata Love Story: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇక లేరు. రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. లక్షల కోట్లకు అధిపతి అయిన రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన ప్రేమకథ ఫెయిల్ అవ్వడంతో ఆయన పెళ్లి చేసుకోలేదా..అయితే అమ్మాయి ఎవరో తెలుసా..రతన్ టాటా ప్రేమకథ వింటే కన్నీళ్లు ఆగవు.

Update: 2024-10-10 01:04 GMT

Ratan Tata Love Story

Ratan Tata Love Story: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇక లేరు. రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. లక్షల కోట్లకు అధిపతి అయిన రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన ప్రేమకథ ఫెయిల్ అవ్వడంతో ఆయన పెళ్లి చేసుకోలేదా..అయితే అమ్మాయి ఎవరో తెలుసా..రతన్ టాటా ప్రేమకథ వింటే కన్నీళ్లు ఆగవు.

ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం, అక్టోబర్ 9, 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. వయస్సు సంబంధిత సమస్యల కారణంగా, రతన్ టాటా కొన్ని రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా తన దాతృత్వ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అయితే రతన్ టాటాకు పెళ్లికాలేదన్న సంగతి అందరికీ తెలిసిందే.రతన్ టాటా పెళ్లి ఎందుకు చేసుకోలేదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త రతన్ టాటా పెళ్లి చేసుకోలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డానని రతన్ టాటా స్వయంగా తెలియజేశారు. అప్పుడే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. పెళ్లి చేసుకోలేకపోవడానికి గల కారణాన్ని రతన్ టాటా వివరిస్తూ.. చాలా కాలంగా తన అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని, అందుకే తాను ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చిందని చెప్పారు.

రతన్ టాటా 1955లో న్యూయార్క్ లోని రివర్ డేల్ కంట్రీ స్కూల్ నుంచి డిప్లామా చేశారు. 1961లో టాటా గ్రూపులో కెరీర్ ను ప్రారంభించారు ఆయన. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూళ్లలో మేనేజ్ మెంట్ డిగ్రీ పూర్తి చేశారు. 2004లో టాటా కన్సెల్టెన్సీ సర్వీస్ ను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగిన రతన్ టాటా భారతదేశం గర్వించే విధంగా గొప్ప వ్యాపారవేత్తగా నిలిచారు. ఆయన చేసి దాత్రుత్వ కార్యక్రమాలు ఎంతో మందికి స్పూర్తినిచ్చాయి. 2014లో ఐఐటీ బాంబేకు రతన్ టాటా ఇచ్చిన 95కోట్లవిరాళం ఒక ఉదాహరణ మాత్రమే. కోవిడ్ సమయంల రూ. 1500కోట్ల భారీ విరాళాన్ని అందించారు రతన్ టాటా.

అయితే రతన్ టాటా పెళ్లి ఎందుకు చేసుకోలేదు. దీని వెనక ఓ పెద్ద లవ్ స్టోరీ ఉంది. రతన్ టాటా అమెరికాలో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించారు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఆ సమయంల రతన్ టాటా అమ్మమ్మ అనారోగ్యంతో ఉండటంతో ఇండియాకు రావాల్సి వచ్చింది. ఆ సమయంలోనే చైనా భారత్ యుద్ధం జరుగుతోంది. దీంతో ఆ యువతి భారత్ కు రావాడానికి అనుమతి లేదు. దీంతో వారి ప్రేమకథ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు.

అయితే ఓ ఇంటర్వ్యూలో తనకు భార్య, పిల్లలు లేకపోవడం కొన్నిసార్లు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుందని చెప్పారు. చాలా మంది అమ్మాయిలతో ప్రేమలో పడ్డప్పటికీ..పనిలో బిజీగాఉండటం వల్ల పెళ్లి వరకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. పెళ్లి జరగకపోవడానికి సరైన సమయం దొరకకపోవడం ఒక కారణమని చెప్పారు. కొన్ని సార్లు ప్రయత్నించినప్పటికీ అది వర్కౌట్ కాలేదన్నారు.

అయితే రతన్ టాటాకు 10ఏండ్లు ఉన్నప్పుడు ఆయన పేరెంట్స్ విడాకులు తీసుకోవడంతో కొంత బాధపడినట్లు చెప్పారు. మా తల్లిదండ్రుల విడాకుల కారణంగా నేను, నా తమ్ముడు బాధపడ్డాము. ఆ రోజుల్లో విడాకులు అనేవి సహజం. మా అమ్మ రెండో పెళ్లి చేసుకోవడంతో స్కూళ్లో పిల్లలు ర్యాగింగ్ చేసేవారు. అయినప్పటికీ మా నానమ్మ గౌరవంగా, గొడవలు లేకుండా ఎలా బతకాలో నేర్పించింది. అది నేటికీ నాలో ఉందంటూ రతన్ టాటా చెప్పుకొచ్చారు.

రతన్ టాటా 1937లో జన్మించారు. 1962లో టాటా గ్రూప్‌లో చేరారు. 1991లో టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు. భారత ప్రభుత్వం రతన్ టాటాను దేశం రెండు అత్యున్నత పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషణ్‌లతో సత్కరించింది. దేశ నిర్మాణంలో ఆయన చేసిన సాటిలేని కృషికి గాను ఈ గౌరవం లభించింది.

Tags:    

Similar News