Health Tips: షుగర్‌ పేషెంట్లకి ఈ పిండి ఒక వరంలాంటిది.. అదేంటంటే..?

Health Tips: షుగర్‌ పేషెంట్లకి ఈ పిండి ఒక వరంలాంటిది.. అదేంటంటే..?

Update: 2022-07-14 03:30 GMT

Health Tips: షుగర్‌ పేషెంట్లకి ఈ పిండి ఒక వరంలాంటిది.. అదేంటంటే..?

Health Tips: డయాబెటీస్‌ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా మారింది. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు దీనికి సరైన మందుని కనిపెట్టలేకపోయారు. డయాబెటిక్ రోగులు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేకుంటే అది అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఆహారంలో గోధుమపిండికి బదులు రాగిపిండిని వాడితే షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. రాగిపిండి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా మనం రోజువారీ ఆహారంలో గోధుమ పిండిని ఉపయోగిస్తాము. కానీ మధుమేహ రోగులు తప్పనిసరిగా రాగి పిండిని తీసుకోవాలి. దీంతో మధుమేహం మాత్రమే కాదు ఊబకాయం, అధిక రక్తపోటు (హై బీపీ) అన్ని వ్యాధుల నుంచి బయటపడవచ్చు. భారతదేశంలో అన్ని వయసుల వారు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా రాగులను చేర్చుకోవాలి. డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేయాలనేది పెద్ద సమస్య. ఆహారం తీసుకోవడంలో చిన్న నిర్లక్ష్యం వహించినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో చాలా మంది ఆరోగ్య నిపుణులు రాగి పిండిని తినమని సలహా ఇస్తున్నారు.

రాగి పిండిలో అనేక రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. రాగులు తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రాగుల్లో ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్ డి, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. షుగర్ మెయింటెయిన్ చేయడంతో పాటు ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాదు శరీరంలో రక్తానికి లోటు ఉండదు. మీరు రాగి పిండితో రోటీ, స్నాక్స్, దోసలను తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Tags:    

Similar News