Foods in Fridge: ఫ్రిజ్‌లో ఈ ఫుడ్‌ ఐటమ్స్‌ పెడుతున్నారా.. జాగ్రత్త..?

Foods in Fridge: కూరగాయలు, పండ్లు, వండిన వంటకాలు తాజాగా ఉండటానికి చాలామంది వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు.

Update: 2022-01-30 01:30 GMT

Foods in Fridge: ఫ్రిజ్‌లో ఈ ఫుడ్‌ ఐటమ్స్‌ పెడుతున్నారా.. జాగ్రత్త..?

Foods in Fridge: కూరగాయలు, పండ్లు, వండిన వంటకాలు తాజాగా ఉండటానికి చాలామంది వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అంతేకాదు కొంతమంది కూల్‌డ్రింక్స్‌, వాటర్, పాలు, పెరుగు కూడా ఫ్రిజ్‌లోనే పెడుతారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొన్ని ఆహారాలు ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి వాటి గుణాలను కోల్పోతున్నాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఈ పరిస్థితులలో ఏ ఆహారాలు, పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టాలి.. ఏవి ఫ్రిజ్‌లో పెట్టకూడదో తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.

తేనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే దాని సహజ సిద్దమైన లక్షణాలను కోల్పోయే అవకాశం ఉంది. తరచుగా ప్రజలు తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతారు, ఇది ఒక విధంగా ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ రోజుల్లో ప్రజలు నూనెలను కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ప్రారంభించారు. అయితే చాలా వరకు నూనెను బయట ఉంచడమే మంచిది. నట్ బేస్డ్ ఆయిల్ అయితే మాత్రం ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.

చాలామంది ఫ్రూట్స్‌ని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అందులో అరటిపండ్లు కూడా ఉంటాయి. అరటిపండుకు కూలింగ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఫ్రిజ్ నుంచి బయటకు తీసి తింటే జలుబు, అంటుకుంటుంది. అంతేకాదు అరటిపండును ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నల్లగా మారుతుంది. కాబట్టి వాటిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచడమే మంచిది. బంగాళదుంపలు ఫ్రిజ్‌లో ఉంచితే మంచిది కాదు. త్వరగా మొలకలు వస్తాయి. బంగాళాదుంపలను ఎల్లప్పుడూ పొడి ప్రదేశంలో ఉంచాలి. నివేదికల ప్రకారం మొలకెత్తిన బంగాళదుంపలు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే దాని రుచి పాడవుతుంది. అది వంటగదిలో ఉంటేనే మేలు. 

Tags:    

Similar News