Health News: గర్భిణులు ఈ 5 పొరపాట్లు ఎప్పుడు చేయకూడదు..!
Health News: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 నుంచి 50 మిలియన్ల వరకు అబార్షన్లు జరుగుతున్నాయి.
Health News: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 నుంచి 50 మిలియన్ల వరకు అబార్షన్లు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గర్భధారణ సమయంలో స్త్రీలు చేసే కొన్ని పొరపాట్లు. ఇవి గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గర్భధారణ సమయంలో స్త్రీలు చేయకూడని 5 తప్పుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. కిందికి వంగి పనిచేయకూడదు
గర్భిణీలు తరచుగా వంగి పనిచేయడం మానుకోవాలి. ఇది పిండంపై ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రీ-మెచ్యూర్ డెలివరీ అవకాశాలు పెరుగుతాయి. వీలైనంత వరకు మెట్లకు బదులుగా లిఫ్ట్ ఉపయోగించండి.
2. ఎక్కువసేపు నిలబడవద్దు
గర్భిణులు చాలా మంది నిలబడి పనిచేయడం సరైనదని అనుకుంటారు. కానీ ఎక్కువసేపు నిలబడటం వల్ల గర్భంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ స్థితిలో మహిళలు 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడకూడదు. వీలైనంత వరకు కూర్చొని పని చేయాలి.
3. ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ
గర్భధారణ సమయంలో ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు. మధ్యమధ్యలో ఏదో ఒకటి తింటూ ఉండాలి. నూనె, అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. దీంతో శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
4. సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి
గర్భధారణ సమయంలో సరైన పాదరక్షలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో హైహీల్స్ అస్సలు ధరించవద్దు. ఇది సమస్యలను కలిగిస్తుంది. సౌకర్యవంతమైన బూట్లు, చెప్పులు ధరించడం మంచిది.
5. బరువైన వస్తువులను ఎత్తవద్దు
గర్భధారణ సమయంలో బరువైన మంచం లేదా సోఫాను కదిలించడం వంటి పనులు చేయకూడదు. బకెట్లలో నీరు మోయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి.