Pregnant Women: పుట్టబోయే బిడ్డ తెలివిగా ఉండాలంటే గర్భిణులకు ఇవి తప్పనిసరి..!
Pregnant Women: ఒక మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం
Pregnant Women: ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి క్షణం ఆమెకు చాలా ప్రత్యేకమైనది. అంతేకాదు బిడ్డ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. సురక్షితమైన ప్రసవాన్ని కోరుకుంటుంది. శిశువు పూర్తిగా ఆరోగ్యంగా, తెలివిగా ఉండాలని ఆకాంక్షిస్తుంది. ఇది జరిగాలంటే సదరు మహిళ ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. అయితే ఒక మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
1. ఆహారంలో గుడ్లు చేర్చాలి
గుడ్లలో సెలీనియం, జింక్, విటమిన్లు ఎ, డి ఉండటంతో పాటు కోలిన్ అనే పోషకం కూడా ఉంటుంది. ఇది గర్భిణులకు చాలా మంచిది. గుడ్లు తీసుకుంటే, పిల్లల మెదడు అభివృద్ధి, అభ్యాస సామర్థ్యం, మంచి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది కాకుండా పిల్లల ఎముకలు కూడా బలంగా ఉంటాయి. కానీ వైద్యుడి సలహా ప్రకారం తీసుకోవాలి.
2. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలు
పిల్లల మానసిక వికాసానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు చాలా ముఖ్యమైనవి. ఇందుకోసం చేపలు, సోయాబీన్స్, బాదం, వాల్ నట్స్, అవిసె గింజలను ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం.
3. తల్లి అలవాట్లు
పిల్లలకు నేర్చుకునే కళ తల్లి గర్భం నుంచే ప్రారంభమవుతుంది. మహాభారత కాలంలో అభిమన్యుడు తల్లి గర్భంలోనే చక్రవ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాడు. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి క్రియేటివ్ వర్క్ చేయడం, బ్రెయిన్ ఎక్సర్ సైజ్ లు చేయడం, రీజనింగ్ సాల్వ్ చేయడం, సుడోకు లాంటివి చేస్తే పిల్లల మైండ్ కూడా షార్ప్ అవుతుంది. ఇది కాకుండా, పుస్తకాలు చదవడం, రాయడం, సంగీతం వినడం కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
4. యోగా, ధ్యానం
మానసిక దృఢత్వానికి యోగా చాలా ముఖ్యం. నిపుణుల సలహాతో యోగాను మీ దినచర్యలో భాగంగా చేయండి. ఒత్తిడి పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే గర్భిణులు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది.