Health Tips: దానిమ్మతో అందం పెంచుకోండి.. ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు..!
Health Tips: దానిమ్మ ఒక సూపర్ ఫ్రూట్.. ఇందులో విటమిన్ సి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి
Health Tips: దానిమ్మ ఒక సూపర్ ఫ్రూట్. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. దానిమ్మ సౌందర్య ఉత్పత్తిగా కూడా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దానిమ్మను ఎలా ఉపయోగించాలో ఈ రోజు తెలుసుకుందాం.
దానిమ్మ, తేనె
చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేట్, తేమగా ఉంచడానికి దానిమ్మ గింజల పేస్ట్‌ను తయారు చేసి ముఖానికి 30 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత మంచినీటితో శుభ్రం చేయండి.
దానిమ్మ, గ్రీన్ టీ
మొటిమల నుంచి ఉపశమనం పొందడానికి దానిమ్మ గింజలను మెత్తగా రుబ్బుకుని రెండు చెంచాల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ గ్రీన్ టీ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటు మర్దన చేసి కడిగేయాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమల సమస్య తొలగిపోతుంది. దీన్ని వారానికి 4 సార్లు అప్లై చేసుకోవచ్చు.
దానిమ్మ, కోకో పౌడర్
దానిమ్మ, కోకో పౌడర్ రెండూ యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించి చర్మం బిగుతుగా, యవ్వనంగా చేయవచ్చు. దానిమ్మ గింజలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కోకో పౌడర్‌ను కలపాలి. ఈ పేస్టులని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వృద్ధాప్యం ఆగిపోతుంది. దీన్ని వారానికి 3 సార్లు అప్లై చేయవచ్చు.