Health Tips: దానిమ్మ రసం ఆరోగ్యానికి ఒక వరం.. రోజు తాగితే అద్భుత ఫలితాలు..!

Health Tips: దానిమ్మ రసం ఆరోగ్యానికి ఒక వరం.. రోజు తాగితే అద్భుత ఫలితాలు..!

Update: 2023-01-13 01:30 GMT

Health Tips: దానిమ్మ రసం ఆరోగ్యానికి ఒక వరం.. రోజు తాగితే అద్భుత ఫలితాలు..!

Health Tips: దానిమ్మలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దానిమ్మలో విటమిన్ సి, విటమిన్ కె, ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. దానిమ్మ లేదా దానిమ్మ రసాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు. దానిమ్మ రసం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

గుండెకు మంచిది

దానిమ్మలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో పనిచేస్తుంది. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.

చర్మానికి ఉత్తమం

దానిమ్మ రక్తాన్ని శుభ్రపరచడానికి పనిచేస్తుంది. దీని జ్యూస్ శరీరాన్ని డిటాక్స్ చేసి శరీరంలోని ఉండే హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. దీంతో చర్మం శుభ్రంగా, మెరుస్తూ ఉంటుంది. దానిమ్మలో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ-ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చర్మాన్ని మెరుగుపరుస్తాయి.

రక్తహీనత నయం

దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనతను తొలగిస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు దూరమవుతాయి.

జీర్ణక్రియకు ప్రయోజనకరం

దానిమ్మ రసం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ రసం తాగడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. కడుపు నొప్పి ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆర్థరైటిస్‌లో మేలు

దానిమ్మలో ఉండే గుణాలు నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీని రసం తాగడం వల్ల కీళ్లనొప్పులు దూరమవుతాయి. దానిమ్మపండులో కాల్షియం, మెగ్నీషియం పోషకాలు ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి.

Tags:    

Similar News