Pollution: కాలుష్యం ఊపిరితిత్తులనే కాదు కళ్లని కూడా దెబ్బతీస్తుంది..! ఎలాగంటే..?

* కాలుష్యం వల్ల ఊపిరితిత్తులే కాదు కళ్లు కూడా దెబ్బతింటున్నాయి.

Update: 2021-11-14 05:02 GMT

కాలుష్యం ఊపిరితిత్తులనే కాదు కళ్లని కూడా దెబ్బతీస్తుంది(ఫైల్ ఫోటో)

Pollution: దేశ రాజధానితో పాటు చాలా మెట్రో నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల పిల్లలు, వృద్ధులు, గర్భిణులు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా నగరాల్లో ఉదయం పూట గాలిలో పొగమంచులా దర్శనమిస్తోంది. ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. అందుకే సుప్రీం కోర్టు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులే కాదు కళ్లు కూడా దెబ్బతింటున్నాయి. అసలు కాలుష్యానికి, కళ్లకు మధ్య ఉండే సంబంధం గురించి తెలుసుకుందాం. కాలుష్యం వల్ల ప్రమాదకరమైన శ్వాసకోశ వ్యాధులే కాకుండా ప్రజల కళ్లు కూడా దెబ్బతింటున్నాయి.

ఈ విషయాన్ని కళ్ల వైద్యులు నిర్దారించారు. కాలుష్యం వల్ల కంటి సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువే అంటున్నారు. ఎందుకంటే కళ్లు పొడిబారడం, ఎలర్జీ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నాయని వివరించారు.

కళ్లకు తేమ, పోషణ కోసం తగినంత మొత్తంలో కన్నీళ్లు ఉత్పత్తి కాకపోతే డ్రై ఐ సిండ్రోమ్ సంభవిస్తుంది. వాయు కాలుష్యం కళ్లలోని కణాలను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కళ్లు పొడిబారడం, ఎరుపెక్కడం, నొప్పి, సున్నితత్వం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

కలుషితమైన గాలిలో నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి మూలకాలు అధికంగా ఉండటం వల్ల కళ్లకు ఎక్కువ నష్టం జరుగుతుంది. అంతేకాదు వాయుకాలుష్యం దీర్ఘకాలిక ప్రభావాల వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

ఉత్తర భారతదేశంలో ఇప్పటికే డ్రై ఐ సిండ్రోమ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. కానీ దక్షిణ భారతదేశంలో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉందని సర్వేలలో వెల్లడైంది. ఇందులో కూడా, పట్టణ ప్రాంతాల ప్రజల కంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చాలా తక్కువ సమస్యలు ఉన్నట్లు నిర్దారించారు. వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటే అనవసరంగా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటం మంచిది.

Tags:    

Similar News