Banana Side Effects: ఈ వ్యక్తులు పొరపాటున కూడా అరటిపండ్లు తినకూడదు.. లాభానికి బదులు నష్టమే..!
Banana Side Effects: అరటిపండుని అందరు ఇష్టపడుతారు.
Banana Side Effects: అరటిపండుని అందరు ఇష్టపడుతారు. ఇది తియ్యగా ఉండటమే కాకుండా అద్భుతమైన పోషకాలని కలిగి ఉంటుంది. అంతేకాదు ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని పేదోడి పండుగా పిలుస్తారు. అరటిపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికి తెలుసు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వీటికి దూరంగా ఉండాలి. లేదంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. అయితే ఎలాంటి వ్యక్తులు వీటిని నివారించాలో ఈరోజు తెలుసుకుందాం.
అధిక బ్లడ్ షుగర్
అరటిపండులో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మధుమేహం ఉన్న రోగులు దీనిని తినకూడదు. అతిగా పండిన అరటిపండ్లను అస్సలు తినకూడదు.
కిడ్నీ సమస్యలు
అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు హానికరం. వారి శరీరం నుంచి అదనపు పొటాషియం విసర్జించడం కష్టం. అలాంటి వారు అరటిపండ్లను తినకుండా ఉండాలి.
మలబద్ధకం
తరచుగా అపానవాయువు, మలబద్ధకం సమస్యలు కలిగి ఉన్న వ్యక్తులు అరటిపండ్లను తినకూడదు. ఇవి సమస్యను తొలగించే బదులు పెంచడానికి పని చేస్తాయి.
అలర్జీ
అలర్జీ ఉన్నవారు అరటిపండ్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. లేదంటే దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన లక్షణాలను కలిగించే అవకాశం ఉంది.
ఆస్తమా
ఆస్తమా రోగులు అరటిపండు తినకూడదు. ఎందుకంటే వారి సమస్య మరింత పెరుగుతుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి.