Health Tips: రక్తపోటు ఉన్నవారు ఈ వ్యాయామాలు అస్సలు చేయకూడదు..!
Health Tips: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం వంటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు.
Health Tips: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం వంటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఒక్కసారి ఈ రోగాలకి గురైతే జీవితం మొత్తం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అధిక రక్తపోటు రోగులు ఆహారం, పానీయాల నుంచి వ్యాయామాల వరకు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు ఉన్న రోగులు కొన్ని వ్యాయామాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం.
అధిక రక్తపోటు రోగులు ఎప్పుడు పరుగెత్తకూడదు. ఆయాసం వస్తోంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల బీపీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది చేతులకు సంబంధించిన సమస్యలను కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు పరుగెత్తకుండా ఉండండి. అలాగే అధిక శక్తి వినియోగించే వ్యాయామాలు కూడా రక్తపోటు రోగులు చేయకూడదు. ఎందుకంటే ఇది మీ బీపీని మరింత పెంచుతుంది. వెయిట్ లిఫ్టింగ్ లేదా బెంచ్ ప్రెస్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ చాలా వేగంగా పెరుగుతుంది. ఇది మీ గుండెపై అలాగే మీ గుండె రక్త నాళాలపై ఒత్తిడిని పెంచుతుంది.
డెడ్ లిఫ్ట్ వ్యాయామాలు కూడా బీపీ రోగులు అస్సలు చేయకూడదు. నేల నుంచి బరువులు ఎత్తడం చాలా ప్రమాదకరం. అధిక రక్తపోటు ఉన్న రోగులు ఇలాంటివి చేయకూడదు. అలాగే వీరు బెంచ్ ప్రెస్ వ్యాయామాలు కూడా చేయకూడదు. ఎందుకంటే వీటివల్ల ఛాతీ పైన ఉన్న కండరాలలో ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు రోగులు వీటికి దూరంగా ఉంటే మంచిది. ఎలాంటి ఒత్తిడి లేని నడక, నిలబడి చేసే సాధారణ వ్యాయామాల వంటివి చేస్తే చాలు.
ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.