Constipation: మలబద్దకంతో బాధపడుతున్నారా.. ఇలా తగ్గించుకోండి..!
Constipation: ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్దకం.
Constipation: ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్దకం. ఈ సమస్య గురించి ఎవ్వరికి చెప్పుకోలేక చాలా అవస్థలు పడుతుంటారు. సాధారణంగా సమయ పాలన లేని ఆహారపు అలవాట్లు, ఆహారంలో ఫైబర్ లోపించడం, గ్యాస్ సమస్యలు తదితర కారణాల వల్ల ఇది ఏర్పడుతుంది. దీనికి ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ పదే పదే అదే ట్యాబ్లెట్లు వాడకూడదు. ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే సహజపద్దతులలో దీనిని తగ్గించుకోవాలి.
మల విసర్జన సజావుగా కాకపోవడాన్ని మలబద్ధకంగా చెబుతారు. శరీరతత్వాన్ని బట్టి ఇది మారుతుంటుంది. తీవ్ర ఒత్తిడితో విరేచనం అవ్వడం, మల ద్వారంపై పగుళ్లు ఏర్పడటం మలబద్దకం లక్షణాలుగా చెప్పవచ్చు. దీనివల్ల మల ద్వారం వద్ద తీవ్రమైన నొప్పి, మంట, వాపు, రక్తం కారడం వంటివి జరుగుతాయి. ఒకటి లేదా రెండు సార్లు మల బద్ధకం రావడం సాధారణ విషయమే. అయితే ఇది తరచుగా జరిగితే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మల బద్ధకానికి చెక్ పెట్టవచ్చు. డైట్‌లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా చేర్చాలి. రోజూ మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల స్థాయి (ఫైబర్) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఫలితంగా మల బద్ధకం సమస్య ఏర్పడకుండా ఉంటుంది. మంచి నీరు, పళ్ల రసాలను ఎక్కువగా తాగాలి. గంటల కొద్ది కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు ప్రతి అరగంటకోసారి లేచి కాస్త అటు ఇటూ నడవాలి. శరీరానికి కావాల్సిన శ్రమను ఇవ్వాలి. వ్యాయామం చేయాలి.