మీ వయసు 30 ఏళ్లు దాటిందా..! ఈ విషయంలో జాగ్రత్త...
Age of 30: ఈ వయసులో మీరు చాలా బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. అంతేకాదు సరిగ్గా ఇదే వయసులో మీ శరీరంలో మార్పులు మొదలవుతాయి.
Age of 30: మీ వయసు 30 ఏళ్లు దాటిందా.. అయితే ఆహారం విషయంలో అప్రమత్తత అవసరం. ఈ వయసులో మీరు చాలా బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. అంతేకాదు సరిగ్గా ఇదే వయసులో మీ శరీరంలో మార్పులు మొదలవుతాయి. సరైన పోషకాలు అందలేదంటే ఆరోగ్యం క్షీణిస్తోంది. అందుకే డైట్‌పై దృష్టిపెట్టాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతారు. అందుకే అలాంటి వారు ఆహారంలో కచ్చితంగా ఈ పదార్థాలు, కూరగాయలు ఉండే విధంగా చూసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
1. చేప
మీరు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడితే మీరు చేపలను తినడం మంచిది. చికెన్, మటన్ ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
2. తేనె
తేనెలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మీరు దీన్ని ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు. కావాలంటే నిమ్మరసం తేనె కలిపి తాగండి. ఇది విటమిన్ సి లోపాన్ని కూడా కవర్ చేస్తుంది.
3. బ్రోకలీ
ప్రొటీన్లు పుష్కలంగా ఉండే బ్రొకోలీ ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు బ్రకోలీతో రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ప్రతిరోజు బ్రోకలిని ఏదో విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
4. విటమిన్ సి
విటమిన్ సితో తయారైన పండ్లను తినడం ద్వారా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా గుండె జబ్బులకు రాకుండా కాపాడుతుంది.
5. డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీ పొట్ట నిండుగా ఉంటుంది. అందువల్ల అతిగా తినడం మానేస్తారు. తేలికపాటి ఆహారం ఎంత ఎక్కువగా తీసుకుంటే శరీరానికి అంత మంచిది. డ్రై ఫ్రూట్స్ పెద్ద మొత్తంలో తినకూడదని గుర్తుంచుకోండి.
6. వెల్లుల్లి
వెల్లుల్లి శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీని సహాయంతో శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేయవచ్చు. అదనంగా ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.