Parents Mistakes: పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేయవద్దు..!

Parents Mistakes: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోవడంలేదు. వారితో గడపడానికి సమయం కేటాయించడం లేదు.

Update: 2024-05-29 13:30 GMT

Parents Mistakes: పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేయవద్దు..!

Parents Mistakes: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోవడంలేదు. వారితో గడపడానికి సమయం కేటాయించడం లేదు. వారి సమస్యలు చెప్పుకోవడానికి ప్రశాంతంగా దగ్గరికి తీసుకోవడం లేదు. పైగా వారు బాగా చదివి ఇది కావాలి అది కావాలి అని లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమీ చేయడం లేదు కానీ వారి కోరికలను మాత్రం వీరిపై బలంగా రుద్దుతున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే పిల్లలు మానసికంగా కుంగిపోయి సూసైడ్ కు పాల్పడుతున్నారు. ఈ రోజు తల్లిదండ్రులు చేస్తున్న తప్పుల గురించి తెలుసుకుందాం.

పిల్లలను ఇతరులతో పోల్చడం

ఇది చాలా మంది తల్లిదండ్రులు చేసే సాధారణ తప్పు. చదువులైనా, క్రీడలైనా, మరేదైనా సరే తమ బిడ్డను ఇతర పిల్లలతో పోల్చకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఆలోచించరు. మీరు చేసే ఈ తప్పు వల్ల వారి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.

పిల్లలపై ఒత్తిడిని ఉంచడం

చాలా మంది తల్లిదండ్రులు వారి కోరికలను పిల్లలపై రుద్దుతారు. వారి అంచనాలకు అనుగుణంగా పని చేయాలని ఆశిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. దీనివల్ల వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆందోళన నిరాశకు గురవుతాడు. ఇది కాకుండా వారు ఏమి సాధిస్తారో తెలుసుకొని అందుకోసం వారిని ప్రోత్సహించండి.

పిల్లల భావాలను విస్మరించడం

పిల్లలు ఏదైనా తల్లిదండ్రులకు చెబితే వారు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు. వారి నిర్ణయాలను, భావాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు. దీనివల్ల వారిలో ఒంటరితనం, అనవసర భయాలు మేల్కొంటాయి. నలుగురిలో కలవలేకపోతాడు. మానసికంగా కుంగిపోతాడు. తల్లిదండ్రులు ఈ తప్పు చేయవద్దు. వారి చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి.

అతి ప్రేమ వద్దు

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు. వారు చెప్పే ప్రతి విషయం, కోరిన ప్రతి వస్తువును లేదనకుండా ఇస్తారు. పిల్లలు ఏది అడిగినా తిరస్కరించలేకపోతారు. దీనివల్ల పిల్లలు చెడిపోతారు. వారిని క్రమశిక్షణలో ఉంచడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. అతిగా మారం చేస్తే తర్వాత అతడి వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పిల్లల లోపాలను దాచవద్దు

కొంతమంది తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లల లోపాలను దాచడానికి ప్రయత్నిస్తారు. వారు ఎల్లప్పుడూ సరైనవారేనని ఎప్పుడూ తప్పులు చేయరని చెబుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అతను తాను చేసేదే కరెక్ట్ అని భావించి తప్పులు చేస్తూ వెళ్తాడు. ఇలా కాకుండా తప్పును తప్పని ఒప్పును ఒప్పని చెబుతూ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. అప్పుడే వారు భవిష్యత్ లో ఉత్తమ పౌరులవుతారు.

Tags:    

Similar News