Health Tips: మధుమేహ రోగులకి బొప్పాయి గింజలు దివ్యఔషధం.. ఎలా ఉపయోగించాలంటే..?
Health Tips: ఈ రోజుల్లో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు.
Health Tips: ఈ రోజుల్లో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. చెడు జీవనశైలి కారణంగా చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. బొప్పాయి గింజలు వంటి కొన్ని ఆహార ఉత్పత్తుల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి గింజలు చాలా మేలు చేస్తాయి. వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
బొప్పాయిలో పీచు అధికంగా లభిస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు దీన్ని ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు రోజూ బొప్పాయి గింజలను తింటే చాలా ప్రయోజనాలను పొందవచ్చు.
బొప్పాయి గింజల్లో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. బొప్పాయి గింజల్లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. బొప్పాయి గింజలలో మిథైల్ ఈస్టర్, ఒలీయిక్ యాసిడ్, హెక్సాడెకనోయిక్ యాసిడ్ వంటి యాంటీ-డయాబెటిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్య రక్షణకి తోడ్పడుతాయి.
బొప్పాయి గింజలు తినడం సురక్షితమేనా?
బొప్పాయి గింజలను తినడం పూర్తిగా సురక్షితం. కానీ వాటిని ఎల్లప్పుడూ తక్కువ పరిమాణంలో తినాలి. ఎందుకంటే మితిమీరిన వినియోగం వల్ల చెడు ప్రభావాలు ఉంటాయి. బొప్పాయి గింజలు చాలా చేదుగా ఉంటాయి. ఇది కొంతమందిలో జీర్ణశయాంతర ప్రేగులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. గర్భిణీ లేదా తల్లిపాలు ఇచ్చే స్త్రీలు బొప్పాయి గింజలను ఎక్కువగా తినకూడదు. బొప్పాయి గింజలని పౌడర్ తయారు చేయడం వల్ల తినవచ్చు.