ముఖంపై ముడతలతో బాధపడుతున్నారా.. బొప్పాయితో ఇలా చేయండి..?

ముఖంపై ముడతలతో బాధపడుతున్నారా.. బొప్పాయితో ఇలా చేయండి..?

Update: 2022-02-03 07:00 GMT

ముఖంపై ముడతలతో బాధపడుతున్నారా.. బొప్పాయితో ఇలా చేయండి..?

Papaya: చాలామంది ముఖంపై ముడతలతో ఇబ్బందిపడుతుంటారు. చిన్న వయసులో ఏర్పడటంతో బయటికి రాలేకపోతుంటారు. అలాంటివారికి ఇది చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. బొప్పాయిని ఉపయోగించడం ద్వారా ముఖంపై ముడతలు తొలగించవచ్చు. అంతేకాదు చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరించవచ్చు. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ డెడ్ స్కిన్, బ్లెమిషెస్, డల్‌నెస్, పిగ్మెంటేషన్ చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. 

బొప్పాయిలో ఎక్స్‌ఫోలియేట్‌ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మం శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. చర్మ రంధ్రాలను లోతుగా శుభ్రపరచడానికి మీరు బొప్పాయి ఫేస్ క్లెన్సర్‌ని ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు బొప్పాయిని మెత్తగా చేస దానికి కొంచెం దోసకాయ పేస్ట్‌ని కలిపి కొంచెం విటమిన్ ఈ ఆయిల్ వేయాలి. ఆ పేస్ట్‌ని చర్మంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్ కోసం బొప్పాయిని సూనర్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం మెత్తని బొప్పాయిలో ఓట్స్, బ్రౌన్ షుగర్ కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ని చర్మానికి అప్లై చేయాలి. ఇది చర్మం డల్‌నెస్, డెడ్ స్కిన్, డ్రైనెస్‌ని తొలగిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడంలో తోడ్పడుతుంది. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే పపైన్ ఎంజైమ్ మొటిమలు రాకుండా చేస్తుంది. మీరు చర్మం పొడిబారడం వల్ల ఇబ్బంది పడుతుంటే బొప్పాయితో చేసిన ఫేస్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు.  

Tags:    

Similar News