Health Tips: శరీరంలోని ఈ భాగాలలో నొప్పి వస్తోందా.. ఆలస్యం చేస్తే.. డేంజర్ జోన్‌లోకే..!

High Cholesterol: జీవనశైలిలో మార్పుల కారణంగా కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. శారీరక శ్రమలు, ఆయిల్ ఫుడ్ వల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

Update: 2023-04-18 14:30 GMT

Health Tips: శరీరంలోని ఈ భాగాలలో నొప్పి వస్తోందా.. ఆలస్యం చేస్తే.. డేంజర్ జోన్‌లోకే..!

High Cholesterol Symptoms: జీవనశైలిలో మార్పుల కారణంగా కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. శారీరక శ్రమలు, ఆయిల్ ఫుడ్ వల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దాని వల్ల అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఉంది. వీటితోపాటు అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి వ్యాధుల బారిన పడే ఛాన్స్ పెరుగుతుంది. అయితే, శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకండి. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలోని ఏ భాగాలలో నొప్పి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?

కొలెస్ట్రాల్ శరీరంలో ఉండే ఓ మైనపు పదార్థం. ఇది మంచి, చెడు రెండు రకాలుగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ద్వారా శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడతాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి?

డాక్టర్ ప్రకారం, ఆరోగ్యకరమైన పెద్దలు 200 mg / dl వరకు కొలెస్ట్రాల్ కలిగి ఉండాలి. ఈ స్థాయి 240 mg / dl దాటితే, అప్పుడు ప్రమాదం పెరిగిందని అర్థం చేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో జీవనశైలిపై శ్రద్ధ వహించాలి.

శరీరంలోని ఈ భాగాలలో తీవ్రమైన నొప్పి ఉంటుందా..

పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) కారణంగా శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి, దాని వల్ల శరీరంలో మార్పులు రావడం ఖాయం. మీరు వ్యాయామం చేసినప్పుడు లేదా భారీ వ్యాయామాలు చేసినప్పుడు, తొడలు, తుంటి, కాళ్ళలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అందువల్ల, ఈ రకమైన నొప్పిని విస్మరించవద్దు. వెంటనే కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేసుకోవాలి.

Tags:    

Similar News