కార్డియాక్‌ అరెస్ట్‌, గుండెపోటు మధ్య తేడా గమనించండి.. లేదంటే చాలా ప్రమాదం..!

Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ రెండూ గుండెకు సంబంధించిన వ్యాధులే.

Update: 2022-08-13 13:30 GMT

కార్డియాక్‌ అరెస్ట్‌, గుండెపోటు మధ్య తేడా గమనించండి.. లేదంటే చాలా ప్రమాదం..!

Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ రెండూ గుండెకు సంబంధించిన వ్యాధులే. అయితే రెండింటికీ చాలా తేడా ఉంటుంది. రెండింటికి కారణాలు భిన్నంగా ఉంటాయి. గుండెపోటులో రోగిని కాపాడటం కొంచెం సాధ్యమవుతుంది. కానీ కార్డియాక్‌ అరెస్ట్‌లో చాలా కష్టమవుతుంది. ఈ రెండు వ్యాధుల మధ్య తేడాల గురించి తెలుసుకుందాం.

గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏంటంటే కొలెస్ట్రాల్ కారణంగా ధమనులలో అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వస్తుంది. అలాగే గుండె వ్యవస్థలో లోపం కారణంగా కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. దీని వల్ల గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది. గుండెపోటు విషయంలో వ్యాధి లక్షణాలు వ్యక్తి శరీరంలో ఒకటి నుంచి రెండు రోజుల ముందు లేదా కొన్ని గంటల ముందు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ లక్షణాలను గమనించి సకాలంలో వైద్యులను సంప్రదిస్తే రోగిని కాపాడవచ్చు.

కార్డియాక్ అరెస్ట్‌లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తీవ్రమైన ఛాతీ నొప్పి, మైకము, పల్స్ లో క్రమంగా తగ్గుదల ఏదైనా ఆలోచించడానికి లేదా అర్థం చేసుకోవడానికి బ్రెయిన్‌ పనిచేయకపోవడం జరుగుతాయి. కార్డియాక్ అరెస్ట్ సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతాడు. శరీరంలోని ఇతర భాగాలతో పాటు అతని మెదడు, ఊపిరితిత్తులకు రక్త సరఫరాకి అంతరాయం కలుగుతుంది. పల్స్ క్రమంగా ఆగిపోతుంది. దీంతో మనిషి చనిపోతాడు. ఈ పరిస్థితులలలో వెంటనే అతనికి CPR ఇవ్వాలి. వ్యక్తి నోటి ద్వారా శ్వాస అందించాలి. పదేపదే గుండెపై ప్రెస్‌ చేయాలి. దీంతో పాటు వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

Tags:    

Similar News